NTV Telugu Site icon

Drug Seize : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో రూ.25కోట్లు విలువ చేసే డ్రగ్స్ సీజ్

New Project 2024 09 16t135150.070

New Project 2024 09 16t135150.070

Drug Seize : దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను రూపుమాపేందుకు కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని టాస్క్ ఫోర్స్, పోలీసు సిబ్బందికి విస్తృత తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ పెడ్లర్ల ఆటకట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉగాండాకు చెందిన ఓ ప్రయాణికురాలి నుంచి 280గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచి తరలించేందుకు ప్రయత్నించింది. కిలాడీ లేడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.NDPS యాక్ట్ కేసు నమోదు చేశారు. పట్టుబడిన కొకైన్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3.85కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ లేడీ పొట్టలో దాచిన కొకైన్ ను శస్త్రచికిత్స చేసి డాక్టర్లు బయటకు తీశారు.

నైజీరియా వ్యక్తి నుంచి 1660గ్రాముల కొకైన్ సీజ్
మరో ఘటనలో దాదాపు రూ.25కోట్ల విలువైన కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 25 కోట్ల విలువ చేసే 1660 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు అధికారులు. నైజీరియా జాతీయుడి వద్ద కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున కొకైన్ ను గుర్తించారు. కొకైన్ ను క్యాప్సూల్స్ లో పొట్టలో కేటుగాడు దాచుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 క్యాప్సూల్స్ మింగాడు స్మగ్లర్. ఎయిర్ పోర్ట్ లో స్మగ్లర్ ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పొట్టలో దాచిన కొకైన్ గుట్టు ను రట్టు చేసింది కస్టమ్స్ బృందం. 70 కొకైన్ క్యాప్సూల్స్ ను శస్త్రచికిత్స చేసి డాక్టర్లు బయటకు తీశారు. స్మగ్లర్ అరెస్ట్ చేసి NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.