NTV Telugu Site icon

AAP-Cong: కాంగ్రెస్, ఆప్ పొత్తుకు బ్రేక్..అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ

Aap Cong

Aap Cong

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మరోసారి విడిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ తెలిపారు. ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

READ MORE: Home Minister Vangalapudi Anitha: గంజాయి కట్టడికి కఠిన చర్యలు.. ANTF ఏర్పాటు..

కాగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోలేదు. ఢిల్లీని మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, ఈ రెండు పార్టీల పొత్తు గురించి ఆప్ నేత, మంత్రి గోపాల్ రాయ్ గత నెలలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ తరుపున ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసమే పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని గోపాల్ రాయ్ అన్నారు. జూన్ ఆరో తేదీన ముఖ్యమంత్రి నివాసంలో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తాజాగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఇరు పార్టీల పొత్తుపై కాంగ్రెస్ వైఖరిని వెల్లడించారు.