Site icon NTV Telugu

Larissa: హర్యానా ఓటర్ జాబితాలో బ్రెజిలియన్ మోడల్ ఫొటో..! ఈ అంశంపై స్పందించిన మోడల్

Model

Model

Larissa Brazilian model: హర్యానాలో 2.5 మిలియన్ల నకిలీ ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ నవంబర్ 5న జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బ్రెజిలియన్ మోడల్ ఫోటోను ఉటంకిస్తూ.. ఆ చిత్రాన్ని వేర్వేరు పేర్లతో 22 సార్లు ఉపయోగించారని ఆరోపించారు. ఓటర్ల జాబితా కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తావించిన బ్రెజిలియన్ మోడల్ ఓ ప్రకటన విడుదల చేసింది. తనకు భారత రాజకీయాలతో సంబంధం లేదని ఆమె పేర్కొంది. ఎవరో ఆమె ఫోటోను స్టాక్ ఇమేజ్ నుంచి కొనుగోలు చేసి దుర్వినియోగం చేశారని తెలిపింది. ఈ మహిళ అసలు పేరు లారిస్సా. ఆమె ఒకప్పుడు మోడలింగ్ చేసేది. కానీ ఇప్పుడు ఆ వృత్తికి దూరంగా ఉంది. అయితే, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. నిన్న రాహుల్‌గాంధీ ప్రస్తవించిన తరువాత తనకు భారతీయ జర్నలిస్టుల నుంచి డజన్ల కొద్దీ సందేశాలు వచ్చాయని లారిస్సా చెబుతోంది. బ్రెజిలియన్‌లో భాషలో ఓ వీడియో విడుదల చేసింది.

READ MORE: Rashi khanna : అలాంటి పాత్రలో నటించడం చాలా కష్టం..

“హలో ఇండియా, భారతీయ జర్నలిస్టులు నన్ను ఒక వీడియో చేయమని అడిగారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు భారత రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఎప్పుడూ భారతదేశానికి రాలేదు. నేను బ్రెజిలియన్ మాజీ మోడల్‌ని, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కూడా. నేను భారతదేశ ప్రజలను ప్రేమిస్తున్నాను. చూడండి, ఈ మొత్తం విషయం చాలా సీరియస్‌గా మారిందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది భారతీయ జర్నలిస్టులు నా నుంచి సమాచారం కోరుతున్నారు. నా కోసం వెతుకుతున్నారు. నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు. నేనే బ్రెజిలియన్ మహిళనని మీరు తెలుసుకోవాలి. నేను ఇప్పుడు మోడల్ కూడా కాదు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను..” అని బ్రెజిలియన్ మోడల్ తెలిపింది.

READ MORE: Ind vs Aus 4th T20: ఉత్కంఠభరిత పోరుకు సర్వం సిద్ధం.. ఆధిక్యం సాధించేది ఎవరు..?

Exit mobile version