Brazil Man : పెళ్లాం విడాకులిచ్చిందన్న ఆనందంతో దూకాడు.. ఆస్పత్రిలో పడ్డాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil Man : ప్రస్తుతం విడాకులను సెలబ్రేట్ చేసుకోవడం ఓ ట్రెండ్ అయింది. ఈ మధ్య ఓ నటి తన విడాకుల వేడుకను సెలబ్రేట్ చేసుకుని ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. విడాకుల వేడుక చేసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. విడాకులు వచ్చేశాయన్న సంబరంలో ఆ యువకుడు సాహసం చేశాడు. కానీ అదృష్టం బాగోలేకపోవడంతో ఆ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. 70 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో అతడి మెడ, వెన్నుముక విరిగి ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన బ్రెజిల్లో వెలుగు చూసింది.
Read Also:Bombay High Court: 80 ఏళ్ల న్యాయ పోరాటం.. 93 ఏళ్ల వయసులో మహిళ విజయం..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
వివరాల్లోకి వెళితే.. రాఫేల్ డాస్ సొంటోస్(22) అనే యువకుడికి ఈ ఏడాది జనవరిలో విడాకులు మంజూరయ్యాయి. దీంతో, సంబరపడిపోయి.. ఇక ఫ్యూచర్లో జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11న కాంపో మాగ్రో ప్రాంతంలోని ఓ సరస్సుకు వెళ్లాడు. అక్కడున్న వంతెన పైనుంచి బంగీ జంప్ చేయాలని అనిపించింది. తన కాళ్లకు తాడు కట్టుకుని బ్రిడ్జిపై నుంచి దూకాడు. దురదృష్టవశాత్తూ కాళ్లకు ఉన్న తాడు తెగిపోవడంతో అతడు 70 అడుగుల ఎత్తు నుంచి తలకిందులుగా పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి మెడ, వెన్నుముక విరిగిపోయాయి. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడిప్పుడే ఆ గాయాల నుంచి కోలుకుంటున్న అతడు తన జీవితం పూర్తిగా మారిపోయిందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు. ‘‘ఒకప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. ప్రస్తుతం నా పరిస్థితి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Also:Telangana martyrs memorial: రాజధానికి మరో మణిహారం.. త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!