NTV Telugu Site icon

Brave Women: దోపిడీ దొంగలు తుపాకీతో బెదిరించినా ఎదురు తిరిగిన తల్లీ కూతుళ్లు.. చివరికి..?

2

2

కొరియర్‌ డెలివరీ బాయ్ రూపంలో పట్టపగలు తుపాకీతో ఇంట్లోకి చొరబడి దోపిడీ కోసం బెదిరించిన దుండగుల్ని ఓ మహిళ ధైర్యంగా నిలబడి నిందితుడితో కలబడింది. దుండగుడితో బాగా పోరాడి అతడిని తిప్పి కొట్టింది. ఈ పోరాటంలో మహిళను కాపాడేందుకు తన 17ఏళ్ల కూతురు కూడా అండగా రావడంతో.. వారిద్దరూ కలిసి హెల్మెట్ తొలగించి అతనిని చితకబాదారు. ఇక నిందితుడ్ని విషయానికి వస్తే.. ఇదివరకు అతడిని ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తిగా గుర్తించారు ఆ మహిళలు. ఈ దోపిడీ ప్రయత్నంలో తల్లి కూతుళ్ల నుంచి ఎదురైన ప్రతిఘటనతో నిందితుల్ని స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. ఇక దోపిడీకి వచ్చిన వారు యూపీకి చెందినట్లు గుర్తించారు.

Also read: IPL 2024: నేటి నుంచి ధనాధన్ ఐపీఎల్ స్టార్ట్..

గురువారం మధ్యాహ్నం బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రసూల్‌పుర జైన్‌ కాలనీ లోని ఓ ఇంట్లో నవరతన్‌ జైన్‌ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం కాలనీ లోని వారు ఉన్న ఇంటికి కొరియర్ డెలివరీ బాయ్ వచ్చారు. కాకపోతే ఆ సమయంలో నవరతన్‌ జైన్‌ ఇంట్లో లేకపోవడంతో.. భార్య అమిత మేహోత్‌, కుమార్తె, పనిమనుషులు మాత్రమే ఉన్నారు. ఇక మొదటగా ఆ సమయంలో మధ్యాహ్నం 2 :15 గంటల సమయంలో ఇద్దరు యువకులు నేరుగా కొరియర్ అంటూ ప్రధాన గేటు నుంచి లోపలకు వచ్చారు. అయితే వారిని గుమ్మం బయటే ఉండాలని అమిత సూచిస్తుండగానే వచ్చిన ఇద్దరిలో ఒకరు నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు.

Also read: Bhoothaddam Bhaskar Narayana: నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాలీవుడ్ సీరియ‌ల్ కిల్ల‌ర్ మూవీ..!

ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి నాటు తుపాకీని ఆమెకు గురిపెట్టాడు. మరోవ్యక్తి వంట గదిలో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టి., ఆపై ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని కోరాడు. దాంతో హెల్మెట్ ధరించిన వ్యక్తిని కాలితో తన్నిన అమిత, బయటకు నెట్టుకుంటూ వచ్చి అతనిని బయటికి నెట్టుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో హెల్మెట్ ఊడిపోగా నిందితుడి చేతిలో ఉన్న తుపాకీని గుంజుకుంది అమిత. ఆపై ఆ వ్యక్తి ఏడాది క్రితం యూపీకి చెందిన సుశీల్‌కుమార్‌గా పేర్కొన్నారు.

ఇక మరోవైపు అతనితో పాటు వచ్చిన మరో నిందితుడు ప్రేమ్ చంద్‌ ఇంట్లోని వంట గదిలో ఉన్న పనిమనిషిని కత్తితో బెదిరించగా.. సుశీల్‌ కుమార్‌ తో పెనుగులాట సమయంలో మరో మార్గంలో పారిపోయేందుకు ప్రయత్నం చేసాడు. కాకపోతే దారి దొరకకపోవడంతో లోపలే ఉండిపోయాడు. ఆపై పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలసులు ప్రేమ్‌చంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తుపాకీతో బెదిరించి నిందితుడు రైల్లో పారిపోతుండగా కాజీపేటలో జిఆర్పీ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.