Site icon NTV Telugu

Leopard-Dog Fight: చిరుతకే చుక్కలు చూపించిన కుక్క..!

Untitled Design (3)

Untitled Design (3)

మహారాష్ట్రలో ఇటీవల వెలుగుచూసిన ఓ ఆశ్చర్యకర సంఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా అడవుల్లో అత్యంత భయంకరమైన మాంసాహారిగా భావించే చిరుతపులిని ఒక సాధారణ కుక్క భయపడకుండా ఎదుర్కొంది. కుక్క చూపించిన వేగం, తెలివితేటలు చూసి చిరుత అయోమయానికి గురైంది. చివరకు వేటాడాలనే ఉద్దేశంతో వచ్చిన చిరుత అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ తాలూకా పరిధిలో చోటుచేసుకుంది. చిరుత–కుక్క మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరితమైన ఘర్షణ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వీడియోలో చిరుత కుక్కకు తెలియకుండా నెమ్మదిగా అడుగులు వేస్తూ దగ్గరికి చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చిరుత ముందుకు కదలగానే, కుక్క అకస్మాత్తుగా ఎదురుదాడికి దిగింది.

కుక్క వెనక్కి తగ్గకుండా ధైర్యంగా తలపడడంతో చిరుత వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా కనిపించే ఒక కుక్క ఇంతటి సాహసాన్ని ఎలా ప్రదర్శించగలిగిందని వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం ఎదురైనప్పుడు పారిపోవడం కంటే దాన్ని ఎదుర్కోవడమే ఆ కుక్క ఎంచుకుంది. అదే నిర్ణయం చివరకు దాని ప్రాణాలను కాపాడిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version