Brave Ark 2-in-1 Tablet: బ్రేవ్ ఆర్క్ 2-ఇన్-1 టాబ్లెట్‌ను బ్రేవ్ సంస్థ భారత మార్కెట్‌లో శుక్రవారం (ఫిబ్రవరి 6న) అధికారికంగా విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఆల్-ఇన్-వన్ టాబ్లెట్‌గా వినియోగదారుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ డివైస్ ఒకే రంగు, ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉంది.
ధర:
భారత్‌లో Brave Ark 2-in-1 టాబ్లెట్ ధరను రూ. 34,999గా నిర్ణయించారు. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ టాబ్లెట్ ప్రస్తుతం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కలర్ ఆప్షన్‌గా గెలాక్టిక్ బ్లూ ఒక్కటే అందుబాటులో ఉంది. అలాగే, ఈ డివైస్‌కు కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన Brave Ark Pen (స్టైలస్) సపోర్ట్ కూడా ఉంది.
డిస్‌ప్లే & డిజైన్:
* ఈ 2-ఇన్-1 కన్వర్టిబుల్ టాబ్లెట్ Android 15పై వర్క్ చేస్తుంది..
* 12.95 అంగుళాల 2.8K (2880×1840 పిక్సెల్స్) IPS టచ్ స్క్రీన్
* 144Hz వరకు రిఫ్రెష్ రేట్
* 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
* 264ppi పిక్సెల్ డెన్సిటీ
* 96 శాతం కలర్ గ్యామట్ సపోర్టుతో పాటు వీడియోలు, గేమింగ్, ప్రొడక్టివిటీ పనులకు ఇది అద్భుత అనుభవాన్ని ఇస్తుంది.
Read Also: T20 World Cup: ఫస్ట్ మ్యాచ్ గోవింద? పాకిస్థాన్‌కు పొంచి ఉన్న గండం..
ప్రాసెసర్, స్టోరేజ్:
* Brave Ark 2-in-1లో Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్
* Adreno 732 GPU
* Qualcomm Hexagon NPU సపోర్ట్ లభిస్తుంది..
* 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి..
* అవసరమైతే మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
కెమెరా:
* వెనుక వైపు 13MP సింగిల్ కెమెరా (ఆటోఫోకస్, LED ఫ్లాష్‌తో)
* ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా
ఆడియో విషయానికి వస్తే, 8 స్పీకర్లు, 2 మైక్రోఫోన్లు, DTS ఆడియో, నాయిస్ రిడక్షన్ సపోర్ట్ ఉన్నాయి. వీడియో కాల్స్, మల్టీమీడియా వినియోగానికి ఇవి మంచి అనుభూతిని ఇస్తాయి.
Read Also: India-US Trade Deal: భారత్ మ్యాప్ విడుదల చేసిన అమెరికా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ సందేశం
బ్యాటరీ:
* ఈ టాబ్లెట్‌లో భారీ 14,550mAh బ్యాటరీ
* 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* Bluetooth 5.4
* Wi-Fi 6
* USB Type-C పోర్ట్
* పోగో పిన్ ఇంటర్‌ఫేస్
కనెక్టివిటీ ఆప్షన్లు:
* Brave Ark 2-in-1 పరిమాణం 291.61 x 191.08 x 7.6 మిల్లిమీటర్లు
* బరువు సుమారు 706 గ్రాములు..
* బ్రేవ్ ఆర్క్ 2-ఇన్-1 టాబ్లెట్ పెద్ద డిస్‌ప్లే
*పవర్‌ఫుల్ ప్రాసెసర్
* భారీ బ్యాటరీతో టాబ్లెట్ + ల్యాప్‌టాప్ అనుభవం కోరుకునే వారికి మంచి ఎంపిక
* గేమింగ్, స్టడీస్, ఆఫీస్ వర్క్- all-in-one డివైస్ కావాలనుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్.
