NTV Telugu Site icon

Akhanda 2 : అఖండ 2 కోసం బోయపాటి భారీ ప్లాన్..?

Akhanda 2 Jpeg

Akhanda 2 Jpeg

Akhanda 2 :బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ అంటే ప్రేక్షకులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “సింహా” మూవీ బ్లాక్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో అప్పటి వరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. దీనితో బోయపాటి బాలయ్య ఫేవరెట్ డైరెక్టర్ గా మారారు.బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన రెండో సినిమా లెజెండ్ కూడా అద్భుత విజయం సాధించింది దీనితో వీరిద్దరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా పేరొచ్చింది.

Read Also :Allu Arjun : అల్లు అర్జున్, అట్లీ సినిమా క్యాన్సిల్ అయిందా..?

బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో మూవీ అఖండ.. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో అద్భుతంగా నటించారు.ఈ సినిమా కూడా అఖండ విజయం సాధించింది.దీనితో బాలయ్య ,బోయపాటి కాంబోలో మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ లో క్రేజ్ మాములుగా ఉండదు.తాజాగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో నాలుగో సినిమాను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసారూ.BB4 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది .ఇదిలా ఉంటే ఈ సినిమాను అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం.ఈ సినిమాను భారీగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం.ఈ సినిమాలో అఖండ కంటే ఎక్కువగా డివోషనల్ కంటెంట్ ఉండనున్నట్లు సమాచారం.

Show comments