NTV Telugu Site icon

Akhanda 2 : విలన్స్ వేట మొదలుపెట్టిన బోయపాటి..

Boyapati

Boyapati

Akhanda 2 : నటసింహం నందమూరి బాలయ్య గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమా తరువాత బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.”NBK 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read Also :Malaika Arora : మలైకా,అర్జున్ బ్రేక్ అప్..క్లారిటీ ఇచ్చిన మలైకా మేనేజర్..

ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 లో నటిస్తున్నాడు.వీరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఏకాహండా సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.ఈ సినిమా సీక్వెల్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.ఇప్పటికే దర్శకుడు బోయపాటి ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాలో బాలయ్యను తలదన్నే విలన్ కోసం వేట కొనసాగిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం బోయపాటి సంజయ్ దత్ ,బాబీ డియోల్ వంటి స్టార్స్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

Show comments