ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. ఈ సినిమాను మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా స్కంద మూవీ పక్కా మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది.. ఈ సినిమాలో యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ అయిన సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా లో హీరో రామ్ వైల్డ్ లుక్ ఫ్యాన్స్ ని ఎంతగానో మెప్పించింది. దీనితో స్కంద సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్కంద సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న రిలీజ్ కి సిద్ధం అయింది. దీనితో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీ గా ఉంది. ఆ ప్రమోషన్స్ లో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్ప కళా వేదికలో ఎంతో ఘనం గా నిర్వహిస్తున్నారు.. ప్రీ రిలీజ్ వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ అంతా కూడా అఖండ 2 కావాలి అని అరుస్తుండడంతో.. మేము అఖండ 2 చేస్తున్నాము కాస్త సమయం ఇవ్వండి అంటూ కొద్దిగా హింట్ ఇచ్చారు. బోయపాటి మాట్లాడుతూ నేను 15 ఏళ్లుగా బాలయ్యతో జర్నీ చేస్తున్నా. బాలయ్య నిజంగా ఒక శక్తి. ఆయనకి ఒక పదమైనా, పాత్ర అయినా లొంగుతుంది.. అందుకే జై బాలయ్య అని ఆయన అన్నారు. బాలయ్య ఈ ఈవెంట్ కి నాతో వున్న సన్నిహితం వలన రాలేదు.ఆయన మా సినిమా గురించి ఒక మాట చెబితే మా సినిమాకు శుభం జరుగుతుందని నమ్మకం.అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ కి బాలయ్య ని ఆహ్వానించాం అని అన్నారు. ఇక స్కంద చిత్రం పక్కా యాక్షన్ మూవీ, మాస్ మూవీ అని అందరూ అంటున్నారు. అదంతా కాదు ఇది పూర్తి ఫ్యామిలీ చిత్రం అని బోయపాటి అన్నారు. ఇందులో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్ కూడా ఉంటుంది అని ఆయన అన్నారు. ఇక రామ్ పోతినేని సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు.సినిమా పై వున్నా ప్యాషన్ వల్ల రామ్ ఈ స్థాయిలో ఉన్నాడు. ఇక శ్రీలీల గురించి మాట్లాడుతూ ఆమె పరిపూర్ణమైన ఆర్టిస్ట్. ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావ్ అని అడుగుతారు కానీ శ్రీలీల కనిపిస్తే మాత్రం ఏ హీరోతో చెయ్యట్లేదు అని అడగాల్సి వస్తోంది అంటూ సెటైర్ వేశారు.. ఇలాగే దూసుకెళ్ళు కానీ ఎక్కువగా పరిగెడితే గ్లామర్ దెబ్బతింటుంది జాగ్రత్తగా వెళ్లు అంటూ శ్రీ లీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.