Site icon NTV Telugu

Nikhat Zareen Dance: సల్మాన్‌తో బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ డ్యాన్స్‌.. స్టెప్పులు అదరగొట్టేసింది..

Nikhat Zareen Dance

Nikhat Zareen Dance

Nikhat Zareen Dance: తెలంగాణ బాక్సర్‌, ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకుంది. తనకు ఇష్టమైన బాలీవుడ్ హీరో సల్మాన్‌తో కలిసి ఓ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ల్మాన్‌ ‘లవ్‌’ సినిమాలోని ఐకానిక్ సాంగ్​ సాథియా తూనే క్యా కియా పాటను రీక్రియేట్​ చేస్తూ ఇద్దరూ నృత్యం చేశారు. బాక్సర్‌ నిఖత్‌కు తగినట్లు సల్మాన్‌ కూడా స్టెప్పులు మూమెంట్స్ ఇచ్చాడు. అనంతరం తన కల నిజమైనట్లు నిఖత్‌ వెల్లడించింది. సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. తెలుగులో వెంక‌టేశ్ న‌టించిన ‘ప్రేమ’ చిత్రాన్ని హిందీలో ‘ల‌వ్’ పేరుతో రీమేక్ చేశారు. ఆ ఫిల్మ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌ న‌టించాడు. అయితే ఆ చిత్రంలోని పాట‌పైనే నిఖ‌త్ డ్యాన్స్ చేయ‌డం విశేషం.

Sunny Leone: టీచర్స్ ఎలిజిబిలిటీ పరీక్షలో సన్నీ లియోన్‌..!

సల్మాన్‌, నిఖత్‌ నృత్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నిఖత్‌ జరీన్‌ పోస్ట్‌ చేసిన వీడియోకు విపరీతంగా లైకులు వచ్చేస్తున్నాయి. చాలా మంది ఈ వీడియో చూసి సూపర్‌ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో నిఖ‌త్ గోల్డ్ మెడ‌ల్ కొట్టిన విష‌యం తెలిసిందే. జరీన్‌ ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాక ఆమెను అభినందిస్తూ సల్మాన్‌ ట్వీట్‌ కూడా చేశారు.

 

Exit mobile version