Botsa Satyanarayana: ప్రజారోగ్యం, విద్య ప్రభుత్వం చేతిలో ఉంటేనే న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.. తాజాగా మండలిలో విపక్షనేత మాట్లాడారు. పీపీపీ మోడ్ లో పెట్టిన కళాశాలలు ఫెయిల్ అయ్యాయని.. ప్రభుత్వం ఆధ్వర్యంలో కళాశాలలకు ఉండే బాధ్యత ప్రైవేటీకరణ జరిగితే ఉండవన్నారు. కరోనా లాంటి విపత్తులు సంభవిస్తే స్పెషాలిటీ ఆస్పత్రుల అవసరం ఉంటుందని.. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.. వైద్యాన్ని, చదువును డబ్బులతో సభ్యులు కొలవటం సరికాదన్నారు.. ఏ ప్రైవేట్ సంస్థ అయినా స్వతంత్ర సంస్థ కాదని.. వాళ్ళు ప్రజలకు సేవ చేయటం కోసం పనిచేయరని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ముఖ్యమంత్రి అయినా ఎంతసేపు ప్రైవేట్ ప్రైవేట్ అంటారని.. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారన్నారు.. విద్యా, వైద్యం కమర్షియల్ కాదు.. గత ప్రభుత్వ హయాంలో జగన్ తీసుకువచ్చారని మేం మద్దతుగా మాట్లాడటం లేదన్నారు.. మంచి ఎవరు చేసిన మంచి అనాలి.. అందుకే ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు గుర్తుంచుకుంటున్నామని చెప్పారు.. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే చరిత్రహీనులుగా మిగులుతామని ఫైర్ అయ్యారు. తాము ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదని.. కానీ విద్య, వైద్యం ప్రైవేట్ విధానానికి వ్యతిరేకమన్నారు.. వీటితో వ్యాపారం చేయాలని ఎవరైనా చూసినా వదిలి పెట్టమన్నారు. తాము ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తామని.. అప్పుడు వాళ్ళ సంగతి చూస్తామన్నారు..
READ MORE: ICC Rankings 2025: ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆటగాళ్ల హవా.. మూడు విభాగాల్లోనూ టాపే!
“పీపీపీ అంటే వాళ్లకు అద్దెకు ఇవ్వటమే అని మీరే చెప్పారు.. అద్దె ఇంట్లో ఉన్నవాడు ఇల్లు ఎలా చూసుకుంటాడు.. వాళ్లకు బాధ్యత ఉంటుందా..? పోర్టులు కూడా ప్రైవేటీకరణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ముడిపెడితే ఎలా..? సంక్షేమం ప్రభుత్వ బాధ్యత? ప్రభుత్వం బేషజాలకు పోకుండా పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. మీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నాం.. మేం ఎప్పుడు మొదలు పెట్టాం.. కోవిడ్ సమయంలో ఎవరైనా బయటకు వచ్చారా..? మీ నాయకుడు కోవిడ్ సమయంలో హైదరాబాద్ నుంచి బయటకు వచ్చారా..? పూర్తిస్థాయిలో పనులు జరగాలనే కొంత సమయం పడుతుంది కదా? మీరు చేయాల్సిన పనులు ఆపి మాపై నిందలు వేస్తున్నారు.. ఇప్పుడు పెట్టే ఖర్చు ఎవరి జేబులోంచి ఇవ్వటం లేదు. నాబార్డు నిధులు వాడుకోవచ్చు.. మాట్లాడితే పులివెందుల కళాశాలకు ఖర్చు పెట్టారు అంటారు.. అది రాష్ట్రంలో లేరా.. మేం అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ మేమే చేశాం.. ప్రజారోగ్యాన్ని ప్రైవేటు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు..” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మీ లావాదేవీల కోసం, తాబేదార్ల కోసం ప్రైవేటుపరం చేయటానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు..
