Site icon NTV Telugu

Border 2 : ‘బోర్డర్ 2’ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్..

Bordar2

Bordar2

పాకిస్తాన్ దాడుల సమయంలో శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ను ఒంటిరిగా రక్షించి, మరణానంతరం పరం వీర చక్ర అందుకున్న వీరుడు ఐఎఎఫ్ ఆఫీసర్ నిరంజన్ సింగ్ సెఖోన్. ఈ లెజెండరీ ఆఫీసర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమే ‘బోర్డర్ 2’. ఇందులో సెఖోన్ పాత్రలో దిల్జిత్ దోసాంజ్ నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్–లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో దిల్జిత్ లుక్ భారీగా ఇంప్రెస్ చేస్తుండగా, ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అద్భుతంగా స్పందిస్తున్నారు.

Also Read : Jaya Bachchan : ఆ విషయంలో.. ఈ తరం పిల్లలకు సలహాలు ఇవ్వలేం

అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, 1997లో వచ్చిన క్లాసిక్ ‘బోర్డర్’కి ఒక విధంగా ఎక్స్‌టెన్షన్‌నే చెప్పాలి. ఈసారి కథ మొత్తం 1971 ఇండో–పాక్ యుద్ధంలో వైమానిక దళం చేసిన సాహసాలు, కీలక ఆపరేషన్‌ల చుట్టూ తిరుగుతుందట. ఇప్పటికే విడుదలైన సన్నీ డియోల్, వరుణ్ ధావన్ పోస్టర్లు మూవీ కి భారీ హైప్ తెచ్చాయి. ఇప్పుడు దిల్జిత్ ఫస్ట్ లుక్ రావడంతో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. సెఖోన్ నిజ జీవితంలో చూపిన ధైర్యం, త్యాగం, దేశభక్తి ఇవన్నీ ఈ సినిమాలో ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ‘బోర్డర్ 2’ను ప్రపంచవ్యాప్తంగా 2026 జనవరి 23న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి ముందు వస్తుండటం వల్ల ఈ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ మరింత పెరుగుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version