NTV Telugu Site icon

Boost Immunity With Mint : పుదీనాతో రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం

Mint Benefits

Mint Benefits

వాడకుండానే సువాసన వచ్చే అద్భుతమైన మొక్క పుదీనా. పుదీనా ను ఔషదాల సంజీవని గా పేర్కొంటారు. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. సంవత్సరం పొడుగునా లభించే పుదీనాలో ఎన్నో ఔషధాలు ఉన్నాయని, వాటి ద్వారా జబ్బులను సులభంగా నయం చేసుకోవచ్చు అని అందరూ చెబుతారు. కానీ ఎవరు పాటించారు. కొందరికైతే పుదీనా వల్ల ప్రయోజనాలు ఏంటో కూడా తెలీదు. పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

పుదీనలో కాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువే. విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ, డీబీ కాంప్లెక్స్‌ విటమిన్లు ఈ ఆకుల్లో దండిగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. అధిక ఐరన్‌, పోటాషియం, మాంగనీస్‌ వంటి వాటి వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరిగిపోవడంతో పాటు మెదడు పనితీరు కూడా బాగా మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లామెటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పుదీనాలో ఉండే విటమిన్‌ సీ,డీ,ఈ, బీలు కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలను దూరం చేస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
Also Read : Dragon Fruit : ఆ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే డ్రాగన్‌ ఫ్రూట్‌ తినండి..!

పుదీనా ఆకులతో టీ ని తయారు చేసుకొని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసుకొని, దీనితో దంతాలు తో అమ్ముకుంటే పల్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక వికారం, వాంతులు తగ్గుతాయి. పుదీన ఆకుల రసం లో కొద్దిగా నిమ్మరసం, తేలేను కలుపుకొని తీసుకోవడం వలన అజీర్ణం, కడుపు ఉబ్బరం, అధికారం వాంతులు వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనా లు క్రమం తప్పకుండా వాడితే మంచిదని వైద్యులు చెప్తున్నారు.

జ్వరం, కామెర్లు తగ్గుతాయి. పుదీన ఆకుల రసం లో అల్లం రసం, కలబందగుజ్జు ఎలుకలు, దాల్చినచెక్క కలిపి నూరి ప్రతిరోజూ రెండు నుంచి మూడు చెంచాలు సేవిస్తూ ఉంటే అరుగుదల పెరుగుతుంది. పుదీన కషాయం ఎలాంటి జ్వరాన్ని అయినా తగ్గిస్తుంది. అంతే కాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతి మంట, మంట, మూత్ర సంబంధ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకొని లేహ్యం లా సేవిస్తే ఉదర సంబంధిత వ్యాధులు నివారణ అవుతాయి. గ్యాస్‌ సమస్యని కూడా దూరం చేస్తుంది. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్ల తలపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్‌ పేరుకుపోయి ఇబ్బంది పడే వారు కూడా ఈ లేహ్యాన్ని తీసుకుంటే ఫలితం కనబడుతుంది.