NTV Telugu Site icon

Bomboo Farming : కాసులు కురిపించే వెదురు పంట..

Bamboo

Bamboo

వెదురు బొంగుల గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది.. వీటిని పండించి అధిక లాభాలను పొందుతున్నారు రైతులు.. వెదురు సాగుతో కూడా లక్షలు సంపాదించవచ్చు. ఈ సాగులో బాగా కలిసొచ్చే అంశం ఏమిటంటే వెదురు మొక్కలు బంజరు భూమిలో కూడా పండించవచ్చు. దీనికి ప్రభుత్వం సగానికి సగం సబ్సిడీ అందజేస్తోంది. వ్యవసాయం ద్వారా బాగా సంపాదించాలనుకుంటే వెదురు సాగు వ్యవసాయం మంచి లాభసాటిది.. ఈ పంట ఎటువంటి నేలల్లో అయిన సులువుగా పండుతుంది..

ఒకసారి పంట వేస్తె, వెదురు మొక్క నుండి ఉత్పత్తి 50 సంవత్సరాల వరకు పడుతుంది. వెదురు పెంపకానికి ఎక్కువ కూలీలు అవసరం ఉండదు. అందుకే వెదురు వ్యవసాయం రైతులకు బాగా ఆదాయాన్ని ఇస్తుంది.. వెదురును ఎక్కడైనా ఎలాంటి భూమిలో అయినా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మన దేశంలో తూర్పు భాగంలో వెదురును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఒక హెక్టారు భూమిలో 1500 వెదురు మొక్కలు నాటవచ్చు. దాని మెరుగైన పెరుగుదల కోసం ఒక మొక్క నుండి మరొక మొక్కకు 2.5 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.. ఇక ఈ పంటలో అనువైన రకాలను చూస్తే.. కిమోనోబాంబుసా ఫాల్కాటా
డెండ్రోకాలమస్ స్ట్రిక్స్
డెండ్రోకాలమస్ హామిల్టోని
మెలోకానా బెకిఫెరా వెదురు బాగా ప్రజాదరణ పొందిన జాతులు..

ఈ పంటను వేసుకోవడానికి ప్రభుత్వం సాయం అందిస్తుంది కూడా.. వెదురు మొదటి కోత మొక్క నాటిన 4ఏళ్ల తర్వాత పంట చేతికి వస్తుంది. సరాసరి ఒక హెక్టారు భూమి 4 సంవత్సరాలలో వెదురు సాగు ద్వారా రూ.40 లక్షల వరకు సంపాదించవచ్చు. దీంతో పాటుగా వెదురు వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఇతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.. ఇతర సందేహాలు ఉంటే వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది..