సమాజంలో రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువై పోతోంది. సెలబ్రిటీలే కాదు.. సామాన్యులు సైతం విడాకుల బాట పడుతున్నారు. పెళ్లిళ్లు మున్నాళ్ల మచ్చటగానే మిగిలిపోతోంది. అయితే విడాకుల సమయంలో భరణం చెల్లిస్తుంటారు. కోర్టు తీర్పులను అనుసరించి భరణానికి ఒప్పుకుంటూ ఉంటారు. కాగా ఓ భర్త మాత్రం తాను భరణం చెల్లించనని చెప్పాడు. ‘నా భార్య నెలకు రూ. 25 వేలు సంపాదిస్తుంది.. నేను భరణం చెల్లించను’ కోర్టు ఆదేశాలను సవాల్ చేశాడు.
Also Read:Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది అప్పుడే.. విజయ్ ఆంటోనీ క్లారిటీ..
ఈ నేపథ్యంలో విడాకుల భరణానికి సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. మహిళ ఉద్యోగం చేస్తుంటే, విడాకుల తర్వాత భర్త నుంచి ఆమెకు లభించే భరణాన్ని కోల్పోవడానికి ఇది ఒక ఆధారం కాదని హైకోర్టు పేర్కొంది. బాంబే హైకోర్టులో జస్టిస్ మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం జూన్ 18న ఈ తీర్పును వెలువరించింది. ఓ వ్యక్తి తన భార్యకు ప్రతి నెలా రూ. 15,000 జీవనాధారం చెల్లించాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేశాడు.
Also Read:Rashmika Mandanna: మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా సైన్ చేసిన నేషనల్ క్రష్షు
ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడు ఆ తర్వాత ఆమెకు రూ.15,000 భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. కానీ తన భార్య ఉద్యోగి అని, ఆమె నెలకు రూ.25,000 సంపాదిస్తుందని బాంబే హైకోర్టులో వాదించాడు. అందువల్ల ఆమెకు భరణం చెల్లించనని చెప్పాడు. తన జీతం నెలకు లక్ష రూపాయలు అని, తన భార్యకు ప్రతి నెలా రూ. 15,000 ఇవ్వడానికి సరిపోదని ఆ వ్యక్తి చెప్పాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రుల బాధ్యత తనదేనని కూడా పిటిషనర్ వాదించాడు. కానీ హైకోర్టు అతని వాదనలను అంగీకరించలేదు.
Also Read:Shubhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా.. ఐఎస్ఎస్‌తో ఆక్సియం-4 డాకింగ్..
మహిళ సంపాదిస్తున్నప్పటికీ, అది ఆమె జీవనోపాధికి సరిపోదని ధర్మాసనం పేర్కొంది. ఆ మహిళ తన ఉద్యోగం కోసం ప్రతిరోజూ చాలా దూరం ప్రయాణిస్తుందని, ఆమె తల్లిదండ్రులు, సోదరుడితో నివసిస్తుందని, ఈ జీతంతో మంచి జీవితాన్ని గడపడం సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. ఆ వ్యక్తి తన భార్య కంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడని, అతని తండ్రికి రూ. 28 వేలు పెన్షన్ వస్తుందని కోర్టు పేర్కొంది. ఇది అతని తల్లిదండ్రులు అతనిపై ఆధారపడటం లేదని చూపిస్తుంది. దీని తర్వాత హైకోర్టు అతని పిటిషన్‌ను తిరస్కరించింది.
