వరవరరావు పిటిషన్ పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. నవంబర్ 18 వరకు సరెండర్ కానవసరం లేదు అని బాంబే హైకోర్టు తెలిపింది. తన ఆరోగ్య పరిస్థితి దృశ్యా హైదరాబాద్ కు తరలించే అంశం పై సేపరెట్ పిటిషన్ దాఖలు చేయాలనీ బాంబే హైకోర్టు సూచించింది. మరోవైపు వరవరరావు ఆరోగ్య పరిస్థితి బానే ఉందని ఎన్ఐఏ కౌంటర్ ఇచ్చింది .వరవరరావును హైదరాబాద్ తరలింపునకు అనుమతి ఇవ్వదని బాంబే హైకోర్టు లో ఎన్ఐఎ కౌంటర్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో 6 నెలల పాటు వరవరరావుకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. సెప్టెంబర్ 5 న కోర్ట్ లో సరెండర్ కావాల్సిన వరవరరావుకు వచ్చే నెల 18 వరకు సమయం ఇచ్చింది బాంబే హైకోర్టు. తదుపరి విచారణను కూడా వచ్చే నెలకు వాయిదా వేసింది.
వరవరరావుకు వచ్చే నెల 18 వరకు సమయం ఇచ్చిన హైకోర్టు…
