Site icon NTV Telugu

Bombay Dyeing Land Deal: ముంబై చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ డీల్.. బాంబే డైయింగ్ 22 ఎకరాల భూమి రూ.5200 కోట్లు

Land

Land

Bombay Dyeing Land Deal: దేశ ఆర్థిక రాజధాని ముంబై చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ డీల్ జరిగింది. వర్లీలోని ఈ భూమిని విక్రయించడం ద్వారా బాంబే డైయింగ్‌కు రూ.5200 కోట్ల ఆదాయం సమకూరనుంది. బాంబే డైయింగ్ 22 ఎకరాల భూమిని జపాన్‌కు చెందిన సుమిటోమో రియాల్టీ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీకి రూ.5,200 కోట్లకు విక్రయించనుంది. వాడియా గ్రూప్‌కు చెందిన బాంబే డైయింగ్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని తెలిపింది.

Read Also:Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఈ డీల్‌కు సంబంధించి సుమిటోమో అనుబంధ సంస్థ గోయిసు రెండు దశల్లో చెల్లింపులు జరుపుతుందని బాంబే డైయింగ్ స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. మొదటి దశలో రూ.4,675 కోట్లు, మిగిలిన రూ.525 కోట్లు కొన్ని షరతులు పూర్తి చేసిన తర్వాత చెల్లిస్తారు. ప్రకటన ప్రకారం, ఒప్పందాన్ని ఆమోదించడానికి బాంబే డైయింగ్ డైరెక్టర్ల బోర్డు బుధవారం సమావేశమైంది. ఈ డీల్ ఇప్పుడు వాటాదారుల ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. వారి ఆమోదం తర్వాత డీల్ పూర్తి చేసే దిశగా చర్యలు ఉంటాయి.

Read Also:iPhone 15 NavIC Support :కొత్త ఐఫోన్ 15 ప్రోలో శాటిలైట్ నావిగేషన్ NavIC సిస్టమ్.. ధర ఎంతంటే?

బాంబే డైయింగ్ తన రుణాన్ని తిరిగి చెల్లించడానికి, భవిష్యత్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి ఈ ఒప్పందం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగిస్తుందని ఎక్స్ఛేంజీకి ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. ఈ వార్తల కారణంగా బాంబే డైయింగ్ షేర్లలో భారీ జంప్ జరిగింది. కంపెనీ షేర్లు 6.93 శాతం భారీ జంప్‌తో ఒక్కో షేరు రూ.140.50 వద్ద ముగిసింది. ఈరోజు కంపెనీ మార్కెట్ క్యాప్‌లో విపరీతమైన పెరుగుదల కనిపించి రూ.2901 కోట్లకు చేరుకుంది. అయితే, కంపెనీ చేసిన ల్యాండ్ డీల్ ధర కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ కంటే చాలా ఎక్కువ. రూ. 5200 కోట్ల ఈ ల్యాండ్ డీల్ బాంబే డైయింగ్ వ్యాపారానికి చాలా లాభదాయకమైన డీల్ అని నిరూపించవచ్చు.

Exit mobile version