Bomb Threats: ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బిగ్ అలర్ట్ వచ్చింది. శంషాబాద్ సహా ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టును పేల్చేస్తామని మెయిల్ వచ్చింది.. ఇండిగో ఎయిర్లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది.. ఎయిర్పోర్టులో తనిఖీలు నిర్వహిస్తున్నారు.. అంతే కాదు.. మరోవైపు.. ఢిల్లీ, ముంబై, చెన్నై, గోవా, తిరువనంతపురం ఎయిర్పోర్టుల్లో సైతం బాంబులు ఉన్నాయంటూ ఇండిగో, ఎయిర్ ఇండియా కార్యాలయాలకు మెయిల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు.. ఐపీ అడ్రస్ ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Mehbooba Mufti: ఉగ్రవాదుల తల్లిదండ్రుల్ని ‘‘వేధించవద్దు’’.. ఉగ్రవాదులకు ముఫ్తీ మద్దతు ఇస్తుందా.?
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. అది కూడా ఎర్రకోట వంటి ప్రముఖ ప్రాంతంలో ఈ పేలుడు జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాదుల లక్ష్యాలను భద్రతా దళాలు భగ్నం చేశారు. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కలకలం సృష్టిస్తోంది.
READ MORE: Mehbooba Mufti: ఉగ్రవాదుల తల్లిదండ్రుల్ని ‘‘వేధించవద్దు’’.. ఉగ్రవాదులకు ముఫ్తీ మద్దతు ఇస్తుందా.?
