Site icon NTV Telugu

Bollywood : గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ‘ధూమ్’ డైరెక్టర్.

Sanjaya

Sanjaya

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ గాద్వి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.. ఆదివారం రోజు మార్నింగ్ వాక్ చేస్తుండగా గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.. సంజయ్ గాద్వి ఆదివారం రోజు ఉదయం లోకండ్ వాలా బ్యాక్ రోడ్ లో మార్నింగ్ వాక్ చేస్తూ గుండెనొప్పికి గురయ్యారు. వేగంగా ఆయన్ని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్ మరణించారు..

ఆయన అంత్యక్రియలను సాయంత్రం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈయన లెజెండరి డైరెక్టర్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరాకెక్కించారు.. ధూమ్ ప్రాంచైజీలో మొదటి రెండు చిత్రాలని సంజయ్ గాద్వి తెరకెక్కించారు. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచారు. ధూమ్ సినిమాలతో సినిమాలు ట్రాక్ మార్చాయి.. అప్పటి నుంచి యాక్షన్ సినిమాలు దర్శనమిస్తున్నాయి..

2000 సంవత్సరంలో సంజయ్ గాద్వి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు ఆయన ప్రారంభించిన తొలి చిత్రమే బడ్జెట్ కారణాలవల్ల ఆగిపోయింది. ఆ తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ తో చేతులు కలిపారు. ధూమ్ 2 తర్వాత పలు హిట్ సినిమాలను తెరాకెక్కించారు.. ఎందరు సీనియర్ హీరోలతో సినిమాలను తెరాకెక్కించారు.. ఆయన మరణ వార్తను విన్న పలువురు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు..

Exit mobile version