NTV Telugu Site icon

Dua Padukone Singh: కూతురికి నామకరణం చేసిన రణ్‌వీర్‌ సింగ్‌ దంపతులు.. పేరేంటంటే?

Deepika Ranveer Daughter

Deepika Ranveer Daughter

Dua Padukone Singh: దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్‌ సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు అయ్యారు. దీపికా కుమార్తెకు జన్మనిచ్చింది. అప్పటి నుండి అభిమానులు వారి కుమార్తెను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే దీపావళి సందర్భంగా దీపిక, రణవీర్ తమ ఇంటి లక్ష్మి ఫోటోను పంచుకున్నారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం తమ కుమార్తె ఫోటోను పంచుకున్నారు. ఇందులో కూతురి ముఖం కనిపించక పోయినా.. ఆమె పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కూతురు రెడ్ కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ ధరించి ఉండటం ఫోటోలో కనిపిస్తోంది. దీంతో పాటు ఇద్దరూ తమ కుమార్తె పేరును కూడా ప్రకటించారు. సోషల్ మీడియాలో ‘దువా పదుకొనే సింగ్’ అని రాసుకొచ్చారు. దువా అంటే ప్రార్థన. ఎందుకంటే, పాప మా ప్రార్థనలకు సమాధానం. మా హృదయలు ప్రేమతో నిండి ఉన్నాయి అంటూ తెలిపారు.

Read Also: Israel Hezbullah Conflict : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి.. భారీ మొత్తంలో కూలిన భవనాలు.. 45 మంది మృతి

ఈ పోస్ట్‌పై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. అలియా భట్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. డయానా పెంటీ కూడా చాలా అందంగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చింది. రణవీర్ చాలా సార్లు కూడా ఇంటర్వ్యూలలో దీపిక గర్భం గురించి మాట్లాడటం కనిపించింది.

Read Also: HYDRA :హైడ్రా క‌మిష‌న‌ర్‌కు అమీన్‌పూర్ బాధితుల ఫిర్యాదు..

ఇకపోతే, ఇద్దరూ రోహిత్ శెట్టి సింగం ఎగైన్ చిత్రంలో కనిపించారు. సినిమాలో ఇద్దరూ అతిధి పాత్రలలో కనిపించారు. దీని తర్వాత రణ్‌వీర్‌ ధురందర్‌, డాన్‌ 3 చిత్రాల్లో నటించనున్నారు. అయితే దీపికా చేయబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఆమె తన కొత్త ప్రాజెక్ట్‌లను ఇప్పటి వరకు ప్రకటించలేదు.

Show comments