బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు సచిన్ సాంఘ్వీ అరెస్ట్ అయ్యాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై శుక్రవారం అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యూజిక్ ఆల్బమ్‌లో ఛాన్స్ ఇస్తానని, వివాహం చేసుకుంటానని చెప్పి సచిన్ సాంఘ్వీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో సాంఘ్వీని అరెస్టు చేసినట్లు ఒక పోలీసు అధికారి ధ్రువీకరించారు. అయితే అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు.
‘ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడింది. ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడు. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇద్దరం ఫోన్ నంబర్లు మార్చుకున్నాం. అనంతరం నన్ను స్టూడియోకు పిలిచి పెళ్లి ప్రపోజల్ చేశాడు. నాపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు’ అని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ముంబై పోలీసు అధికారి తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదు దారురాలు 20 ఏళ్ల మహిళ.
Also Read: Mohsin Naqvi: నఖ్వీ నాటకాలు.. రహస్య ప్రదేశానికి ఆసియా కప్ 2025 ట్రోఫీ!
మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సచిన్ సంఘ్వి న్యాయవాది ఆదిత్య మిథే స్పందించారు. మహిళ ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అని మండిపడ్డారు. సంఘ్వి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉందని చెప్పారు. న్యాయం కోసం తాము పోరాడతామని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై సచిన్ సంఘ్వి ఇంకా స్పందించలేదు. ఏదేమైనా ఈ ఆరోపణలు సచిన్‌పై ప్రభావం చూపనున్నాయి. స్త్రీ 2, భేదియా సినిమాలతో సచిన్ సంఘ్వి ఫుల్ ఫేమస్ అయ్యాడు. తాజాగా రిలీజ్ అయిన థామా చిత్రానికి కూడా అతడు మ్యూజిక్ ఇచ్చాడు.
