Site icon NTV Telugu

Ranaveer Singh: బన్నీ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బాలీవుడ్ హీరో..

Ranaveer

Ranaveer

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎనర్జీ కి బాప్ అని అందరు అంటారు.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది.. ఏ ఈవెంట్ కు వచ్చినా కూడా ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఎప్పుడూ ఫుల్ జోష్‍తో ఉంటారు. ఏవైనా ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రామ్‍లలో పాల్గొంటే హంగామా చేస్తుంటారు.. తాజాగా రణవీర్ డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహ రిసెప్షన్‍లోనూ రణ్‍వీర్ సింగ్ తన మార్క్ డ్యాన్స్‌తో రెచ్చిపోయారు.. ఆ వీడియోను నిన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ షేర్ చేశాడు.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో అల్లు అర్జున్ పుష్ప లోని ఊ అంటావా మావా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసాడు రణవీర్ సింగ్.. ఈ పాటకు సంగీతం అందించిన దేవీ శ్రీప్రసాద్‍తో కలిసే రణ్‍వీర్ డ్యాన్స్ చేశారు. రణ్‍వీర్ ఈ సాంగ్‍కు గ్రేస్‍తో చిందేశారు. దేవీని గిల్లుతూ సరదాగా చిందేశారు. మొత్తానికి తన మార్క్ స్టెప్పులతో అందరిని తెగ ఆకట్టుకున్నాడు..

ఏప్రిల్ 29 న అంతర్జాతీయ డ్యాన్స్ డే సందర్భంగా ఈ వీడియో షేర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు దేవి శ్రీ.. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంతోషంలో ఉన్నా.. బాధలో ఉన్నా డ్యాన్స్ చేయాలని నేను నమ్ముతా. డైరెక్టర్ శంకర్ కూతురు రిసెప్షన్‍లో నాకు ఈ అద్భుతమైన డ్యాన్స్ జ్ఞాపకాన్ని ఇచ్చిన బ్రదర్ రణ్‍వీర్ సింగ్‍ నీకు థ్యాంక్స్ అని దేవీ ట్యాగ్ చేశారు.. ఇక దేవి ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా ఆగస్టు 15 న విడుదల కాబోతుంది..

View this post on Instagram

 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

Exit mobile version