Hero Govinda: బాలీవుడ్ నటుడు గోవిందకు బుల్లెట్ గాయాలయ్యాయి. బాలీవుడ్ నటుడు గోవిందా కాలికి బుల్లెట్ తగిలింది. గోవిందకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. తుపాకీని శుభ్రం చేస్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. మూలన ఉన్న తుపాకీని తీసి… బాలీవుడ్ నటుడు గోవిందా చెక్ చేస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలిపోయింది. ముంబైలోని ఇంటి నుంచి బయలు దేరుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఉదయం 4.30 గంటల ప్రాంతంలో బుల్లెట్ గాయాలు అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. వెంటనే అతని సిబ్బంది.. గోవిందను ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Hero Govinda: బాలీవుడ్ హీరో గోవిందకు బుల్లెట్ గాయాలు.. ఆందోళనలో అభిమానులు
Show comments