NTV Telugu Site icon

Vishwambhara :విశ్వంభర కోసం మరో టాలెంటెడ్ నటుడిని దింపారు…

Viswambharaaa

Viswambharaaa

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. కుర్ర హీరోలకు పోటీని ఇచ్చేలా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమాలో చిరు యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది..

విశ్వంభరతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట ఏదొక కొత్తదాన్ని పరిచయం చేస్తున్నాడు.. విశ్వంభర బృందం ఇప్పుడు కమాండింగ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని స్వాగతించింది.. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ను దించింది. రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ మొదలైన అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించిన నటుడు విశ్వంభరలో పవర్ ఫుల్ పాత్ర కోసం ఎంపికయ్యాడు. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అయ్యాడు.. తాజాగా అతని పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు..

ఈ సినిమా కోసం చిరు పెద్ద రిస్క్ చేస్తున్నాడు.. డూప్ లేకుండా తానే యాక్షన్ సీన్లను చేస్తున్నాడు.. విశ్వంభర సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ లెన్స్‌మెన్ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్..త్వరలో ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రాబోతుందని సమాచారం..