NTV Telugu Site icon

B.Vinod Kumar: ఆగస్టు 15 అన్నారు.. డేట్ మార్చి జనవరి 26న రుణమాఫీ అంటారు..

Boinpalli Vinod Kumar

Boinpalli Vinod Kumar

B.Vinod Kumar: ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి మళ్ళీ మాట మార్చి జనవరి 26న రుణమాఫీ చేస్తానని అంటాడని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో కార్నర్ మీటింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు చాలా ప్రాముఖ్యత కూడుకున్నది ఆశమాశి ఎన్నికలు కాదన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పార్లమెంటులో 17 సీట్లతో తెలంగాణ బిల్లు ఎలా పెడతారని ఎద్దేవా చేశారన్నారు.

Read also: Tamannaah Bhatia : సారీ రాలేను.. నాకు టైం కావాలి.. సైబర్ సెల్ ను కోరిన తమన్నా

దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వం సాధించామన్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసే ప్రమాదముందన్నారు. గోదావరి జలాలను తెలంగాణ వాటా కోసం ఆనాడు కేంద్రమంత్రితో పోరాటం చేసి సాధించుకుందామని తెలిపారు. నది జలాల వాటాల కోసం కేంద్రంలో కొట్లాడేది టిఆర్ఎస్ పార్టీ ఎంపీలే తప్ప బిజెపి కాంగ్రెస్ పార్టీలు పోరాటం చేయరన్నారు. కరీంనగర్ జిల్లాకు 1000 కోట్లతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దామన్నారు. కరీంనగర్ నుండి సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ హైదరాబాద్ గజ్వేల్ వరంగల్ లాంటి ప్రాంతాలకు ఫోర్ వే లైన్లను తీసుకువచ్చింది టిఆర్ఎస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు.

Read also: Namburu Sankara Rao: మంచిని చూడండి.. మనసారా ఆశీర్వదించండి: నంబూరు శంకరరావు

ఉప్పల్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసిన రైల్వే శాఖ ఆధ్వర్యంలో చేసే పనిని బిజెపి పార్టీ ఎందుకు చేయలేకపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అందించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా సాంక్షన్ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆరవాయితీగా రెండేళ్లకు ఒకసారి ముఖ్యమంత్రి మారుతారు అది తప్పకుండా జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి మారిన మరుక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి మళ్ళీ మాట మార్చి జనవరి 26న రుణమాఫీ చేస్తానని అంటాడని కీలక వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను పార్లమెంటుకు పంపండి రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తానని తెలిపారు.
Allari Naresh : ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్..