Site icon NTV Telugu

Penamaluru: పెనమలూరు సీటుపై వీడిన ఉత్కంఠ.. సంబరాల్లో బోడె ప్రసాద్..

Penamaluru 2

Penamaluru 2

Penamaluru: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం సీటు కూడా కాక రేపింది.. వైసీపీ అధిష్టానం అనూహ్యంగా పెనమలూరు నుంచి మంత్రి జోగి రమేష్‌ని బరిలోకి దింపగా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి.. ఫ్యాన్‌ కింద నుంచి పక్కకు జరిగి సైకిల్‌ ఎక్కారు.. అయితే, పార్థసారథిని అక్కడి నుంచి బరిలోకి దింపకుండా పక్కను జరిపిన టీడీపీ అధిష్టానం.. నూజివీడు నియోజకవర్గం నుంచి పోటీక పెట్టింది.. అయితే, పెనమలూరు నుంచి ఎవరైతే బాగుంటుందనే తర్జనభర్జన పడింది.. సర్వేలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో పెనమలూరు ఇంచార్జ్‌గా ఉన్న బోడె ప్రసాద్‌కు టికెట్‌ లేదనే సందేశాన్ని పంపింది.. కానీ, పట్టువీడని విక్రమార్కుడిలా.. తన ప్రయత్నాలు కొనసాగించారు. చివరకు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ టికెట్ బోడె ప్రసాద్ కు కేటాయించారు చంద్రబాబు.

Read Also: Viral Video: ఏంటి భయ్యా ఇప్పుడు ఏసీలను ఇలా కూడా వాడేస్తున్నారా..?

అయితే, మొదటి, రెండు విడతల్లో టికెట్ దక్కకపోవడంతో చంద్రబాబు, లోకేష్ ఫొటోతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ప్రకటించారు బోడె ప్రసాద్. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టిన బోడె ప్రసాద్ కు మూడో విడతలో టికెట్ కేటాయించడంతో.. ఆయన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.. మొత్తంగా పెనమలూరు సీటుపై ఉత్కంఠ వీడింది.. ఎట్టకేలకు బోడె ప్రసాద్ కు సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం.. తొలుత బోడెకు సీటు ఇవ్వలేమని చెప్పిన అధిష్టానం.. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతానని.. చంద్రబాబు ఫొటోతో ప్రచారం చేస్తున్న బోడె వైపే మొగ్గుచూపింది.. ఇక, పెనమలూరు సీటు కోసం అనేక పేర్లు పరిశీలించింది టీడీపీ అధిష్టానం.. ఓ దశలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, దేవినేని ఉమా.. ఇలా రకరాల పేర్లు తెరపైకి వచ్చాయి.. చివరకు బోడెకే సీటు దక్కింది.. దీంతో, బోడె ప్రసాద్‌ కార్యాలయంలో సంబరాలు నిర్వహించాయి టీడీపీ శ్రేణుల.. చంద్రబాబుకి, పెనమలూరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ప్రకటించారు బోడె ప్రసాద్.. పెనమలూరు సీటు భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబుకి బహుమానంగా ఇస్తాను అన్నారు.. మూడో సారి సీటు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ కి రుణపడి ఉంటాను అన్నారు బోడె ప్రసాద్.

Exit mobile version