NTV Telugu Site icon

Bobby : బాలయ్యతో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయబోతున్న యంగ్ డైరెక్టర్..?

Whatsapp Image 2023 07 30 At 12.26.48 Pm

Whatsapp Image 2023 07 30 At 12.26.48 Pm

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కకుతున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రను పోషిస్తుంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే భగవంత్ కేసరి సినిమా షూటింగ్ దశ లో ఉండగానే బాలయ్య బాబీతో ఒక సినిమాకు కమిట్ అయ్యారు…తన పుట్టినరోజు సందర్బంగా బాలయ్య బాబీ సినిమాను ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టారు.. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి రకరకాల వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా లో బాలయ్యను దర్శకుడు బాబీ సరికొత్తగా చూపించబోతున్నాడని సమాచారం.బాలయ్య తో పక్కా యాక్షన్ డ్రామాను కాకుండా ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ఫ్యామిలీ డ్రామాకు ఎమోషన్స్ ను జత చేసి అదిరిపోయే కథను రాసుకున్నాడట బాబీ. బాలయ్య సినిమా అంటేనే యాక్షన్ సీన్స్ తో నిండి ఉంటుంది. అయితే ఈసారి ఈ సినిమా లో కాస్త డిఫరెంట్ గా బాలయ్య క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు సమాచారం.. ఈ సినిమా లో యాక్షన్ సీన్స్ కంటే ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం. దీనితో ఈ సినిమాపై భారీ గా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.