Sabitha Indrareddy: తెలంగాణ ఇంటర్మీడియట్ సిలబస్ మార్పు విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నాంపల్లి రూసా బిల్డింగ్ లో ఇంటర్మీడియట్ విద్యామండలి సమావేశం కొనసాగింది.. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు ఇన్ ఛార్జి సెక్రటరీ నవీన్ మిట్టల్ హాజరయ్యారు. ఇంటర్ సిలబస్‌లో మార్పు చేపట్టాలన్న వాదనలు కొన్నిరోజులుగా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Read Also: Amazon Huge Loss: ఆ కారణంతో రూ.82లక్షల కోట్ల సంపద కోల్పోయిన అమెజాన్
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఎలాంటి తీర్మానాలు చేయలేదని తెలిపారు. అనుబంధ గుర్తింపు పొందని కాలేజీల అంశంపై కీలక చర్చలు జరిపామన్నారు. మే చివరివరకు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ కాలేజీలకు ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు.. అందులోని విద్యార్థులకు ప్రైవేటుగా పరీక్ష రాసే ప్రతిపాదనలపైనా చర్చలు జరుపుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా పాఠ్యపుస్తకాల పంపిణీలో ఆలస్యమవుతోందని తెలిపిన మంత్రి, ఈసారి ఆ పరిస్థితులు రాకుండా ఇప్పుడే ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగానే పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రయోగాత్మకంగా ఇంటర్‌లో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్ విధానంలో జరపాలన్న ప్రతిపాదనపై మంత్రి సబితా అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.