NTV Telugu Site icon

Blue Supermoon 2024: నేడు నీలిరంగులో మరింత ప్రకాశవంతంగా కనిపించనున్న చంద్రుడు..

Blue Supermoon 2024 Copy

Blue Supermoon 2024 Copy

Blue Supermoon and Raksha Bandhan 2024: ఈరోజు కేవలం రక్షాబంధన్ మాత్రమే కాదు. ఈరోజు అంతరిక్షంలో భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో 30 శాతం ఎక్కువ చంద్రకాంతి ఉంటుంది. చంద్రుడు 14 శాతం పెద్దగా కనిపించనున్నాడు. అంటే ఈరోజు మాత్రమే చంద్రుడు ఆకాశంలో ఇలా కనిపిస్తాడు. ఈరోజు ” సూపర్ మూన్ ” ఆవిర్భవించనుంది. దీనిని స్టర్జన్ సూపర్‌ మూన్ అని కూడా అంటారు. ఈ సూపర్‌ మూన్ రాత్రి 11.55 గంటలకు అతిపెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నిజానికి బ్లూ సూపర్‌ మూన్‌ లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది నెలవారీ బ్లూ మూన్. అంటే ప్రతి రెండవ వారానికి చంద్రుడు కనిపిస్తాడు. రెండవ సీజనల్ బ్లూ మూన్ ఒక సీజన్‌లో కనిపించే నాలుగు పౌర్ణమిలలో మూడవది.

Raksha Bandhan 2024: సోదరులకు రాఖీ కట్టి.. తుదిశ్వాస విడిచిన యువతి!

మొదటి పౌర్ణమి జూన్ 22న జరిగింది. తరువాత రెండవది జూలై 21న, మరి ఇప్పుడు మూడవది ఆగస్టు 19న. అంటే ఈ సీజన్‌లో ఇది మూడో బ్లూ మూన్. దీని తర్వాత సెప్టెంబర్ 18న హార్వెస్ట్ మూన్ ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 22న విషువత్తు. NASA ప్రకారం, సీజనల్ బ్లూ మూన్ ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఇలా అక్టోబర్ 2020, ఆగస్టు 2021, ఇప్పుడు దీని తర్వాత వచ్చే సీజనల్ బ్లూ మూన్ మే 2027లో కనిపిస్తుంది. మీరు దీన్ని మీ టెర్రేస్ లేదా ప్రాంగణంలో నుండి సులభంగా చూడవచ్చు. చంద్రుడి ఉపరితలాన్ని చూడాలంటే టెలిస్కోప్ సాయం తీసుకోవాల్సిందే.

Tiruvuru: తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం..

చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, దాని పరిమాణం 12 నుండి 14 శాతం పెద్దదిగా కనిపిస్తుంది. సాధారణంగా భూమి నుండి చంద్రుని దూరం 406,300 కి.మీ. కానీ ఈ దూరం 356,700 కిమీకి తగ్గినప్పుడు చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు. అందుకే దీన్ని సూపర్‌మూన్‌ అంటారు. ఈ సమయంలో చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి దగ్గరగా వస్తాడు. ఎందుకంటే, చంద్రుడు భూమి చుట్టూ వృత్తాకార కదలికలో తిరగడు. ఇది దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భూమికి దగ్గరగా రావడం ఖాయం. దగ్గరగా రావడం వల్ల దాని ప్రకాశం కూడా పెరుగుతుంది.