Rocket Explosion: బ్లూ ఆరిజిన్‌కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rocket Explosion: ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్’కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘న్యూ గ్లెన్’ రాకెట్‌కు సంబంధించిన హాట్-ఫైర్ పరీక్ష సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో బ్లూ ఆరిజిన్ ప్రయోగ కేంద్రం ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగతో కమ్ముకుంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భవిష్యత్ అంతరిక్ష మిషన్‌కు సంబంధించిన సన్నాహాల్లో భాగంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రాకెట్‌ను ప్రయోగానికి ముందు పరీక్షించే అత్యంత కీలక దశల్లో హాట్-ఫైర్ టెస్ట్ ఒకటి. ఇందులో రాకెట్‌ను నేలకే బిగించి ఉంచి ఇంజిన్లను ఆన్ చేసి పనితీరు, ఇంధన వ్యవస్థలు, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ ఘటనపై స్పందించిన బ్లూ ఆరిజిన్ సంస్థ, పరీక్ష సమయంలో “అసాధారణ పరిస్థితి” ఏర్పడిందని వెల్లడించింది. “నేటి హాట్-ఫైర్ పరీక్షలో ఒక అనామలీ చోటుచేసుకుంది. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలిసిన వెంటనే వెల్లడిస్తాం” అని కంపెనీ తెలిపింది. పేలుడు కారణంగా పరీక్ష వాహనం, పరిసర మౌలిక వసతులకు గణనీయమైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే నష్టం ఎంత మేర జరిగిందనే విషయంపై సంస్థ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అలాగే ఈ ప్రమాదం వల్ల భవిష్యత్ ప్రయోగాల షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశం కూడా స్పష్టత రాలేదు.
ఘటన అనంతరం జెఫ్ బెజోస్ కూడా స్పందించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఘటనకు గల కారణాలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. “సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. అసలు కారణం ఏమిటో ఇప్పుడే చెప్పలేం. కానీ దానిపై పరిశోధన ప్రారంభించాం. ఇది చాలా కఠినమైన రోజు. అయినప్పటికీ అవసరమైనదంతా మళ్లీ నిర్మించి తిరిగి ప్రయోగాలను కొనసాగిస్తాం” అని బెజోస్ పేర్కొన్నారు. 98 మీటర్లకు పైగా ఎత్తుతో రూపొందిస్తున్న న్యూ గ్లెన్ రాకెట్, భారీ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలను కక్ష్యలోకి పంపేందుకు రెడీ అవుతుంది. వాణిజ్య, ప్రభుత్వ అంతరిక్ష రంగాల్లో బ్లూ ఆరిజిన్ కీలక పోటీదారుగా నిలవాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే అంతరిక్ష రాకెట్ అభివృద్ధిలో పరీక్షల సమయంలో ఇలాంటి వైఫల్యాలు సహజమేనని నిపుణులు చెబుతున్నారు. గతంలో అనేక ప్రముఖ అంతరిక్ష సంస్థలు కూడా ప్రారంభ దశల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, తరువాత విజయవంతమైన ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధి చేశాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..