Rocket Explosion: బ్లూ ఆరిజిన్‌కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rocket Explosion: ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్’కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘న్యూ గ్లెన్’ రాకెట్‌కు సంబంధించిన హాట్-ఫైర్ పరీక్ష సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో బ్లూ ఆరిజిన్ ప్రయోగ కేంద్రం ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగతో కమ్ముకుంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భవిష్యత్ అంతరిక్ష మిషన్‌కు సంబంధించిన సన్నాహాల్లో భాగంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రాకెట్‌ను ప్రయోగానికి ముందు పరీక్షించే అత్యంత కీలక దశల్లో హాట్-ఫైర్ టెస్ట్ ఒకటి. ఇందులో రాకెట్‌ను నేలకే బిగించి ఉంచి ఇంజిన్లను ఆన్ చేసి పనితీరు, ఇంధన వ్యవస్థలు, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు.
Also Read
- MS Dhoni: "డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా".. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
- Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
- Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
- Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
ఈ ఘటనపై స్పందించిన బ్లూ ఆరిజిన్ సంస్థ, పరీక్ష సమయంలో “అసాధారణ పరిస్థితి” ఏర్పడిందని వెల్లడించింది. “నేటి హాట్-ఫైర్ పరీక్షలో ఒక అనామలీ చోటుచేసుకుంది. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలిసిన వెంటనే వెల్లడిస్తాం” అని కంపెనీ తెలిపింది. పేలుడు కారణంగా పరీక్ష వాహనం, పరిసర మౌలిక వసతులకు గణనీయమైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే నష్టం ఎంత మేర జరిగిందనే విషయంపై సంస్థ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అలాగే ఈ ప్రమాదం వల్ల భవిష్యత్ ప్రయోగాల షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశం కూడా స్పష్టత రాలేదు.
ఘటన అనంతరం జెఫ్ బెజోస్ కూడా స్పందించారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఘటనకు గల కారణాలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. “సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. అసలు కారణం ఏమిటో ఇప్పుడే చెప్పలేం. కానీ దానిపై పరిశోధన ప్రారంభించాం. ఇది చాలా కఠినమైన రోజు. అయినప్పటికీ అవసరమైనదంతా మళ్లీ నిర్మించి తిరిగి ప్రయోగాలను కొనసాగిస్తాం” అని బెజోస్ పేర్కొన్నారు. 98 మీటర్లకు పైగా ఎత్తుతో రూపొందిస్తున్న న్యూ గ్లెన్ రాకెట్, భారీ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలను కక్ష్యలోకి పంపేందుకు రెడీ అవుతుంది. వాణిజ్య, ప్రభుత్వ అంతరిక్ష రంగాల్లో బ్లూ ఆరిజిన్ కీలక పోటీదారుగా నిలవాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే అంతరిక్ష రాకెట్ అభివృద్ధిలో పరీక్షల సమయంలో ఇలాంటి వైఫల్యాలు సహజమేనని నిపుణులు చెబుతున్నారు. గతంలో అనేక ప్రముఖ అంతరిక్ష సంస్థలు కూడా ప్రారంభ దశల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, తరువాత విజయవంతమైన ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధి చేశాయి.
తాజావార్తలు
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!