Blood Moon: సెప్టెంబర్ 7వ తేదీ ఓ అద్భుతమైన ఖగోళ సంఘటన ఆకాశాన్ని అలరించబోతోంది. అదే ‘బ్లడ్ మూన్’ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు, రాగి రంగులలో మెరిసిపోతూ ఆకాశంలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఈ ‘బ్లడ్ మూన్’ చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా దర్శనమిస్తుంది. భారత్‌లో కూడా ఈ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పూణే, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల ప్రజలు దీన్ని చూడవచ్చు. అయితే, ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు, మేఘావరణం లేదా కాలుష్యం దర్శనాన్ని ప్రభావితం చేసే అవకాశముంది.
మెడికల్, ఇంజనీరింగ్, ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారందరికి LIC Golden Jubilee Scholarship 2025
చంద్రగ్రహణం ఎందుకు ఎరుపు రంగులో?
భూమి సూర్యుడు, చంద్రుడి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడిపై భూమి నీడ పూర్తిగా పడుతుంది. అయినా చంద్రుడు పూర్తిగా చీకటిగా మారిపోడు. దీనికి కారణం భూమి వాతావరణం. సూర్యకాంతి భూమి వాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు నీలి రంగు కాంతి వ్యాపిస్తుంది. కానీ ఎరుపు, నారింజ కిరణాలు మాత్రం వంగి చంద్రుడిని చేరుతాయి. అందువల్ల చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరిసిపోతాడు.
ఇక ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదా? కొత్తగా రాబోతున్న Aadhaar యాప్!
ఎలా చూడాలి?
ఈ గ్రహణాన్ని చూసేందుకు ప్రత్యేక కళ్లద్దాలు అవసరం లేదు. నేరుగా కంటితోనే సురక్షితంగా వీక్షించవచ్చు. బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ వాడితే మరింత స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మేఘాలు లేని నిర్మలమైన ఆకాశం ఉన్న ప్రదేశాల్లో వీక్షిస్తే మంచి అనుభూతి లభిస్తుంది. ఇదివరకు ఇంత ఎక్కువ సేపు కనిపించే చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరిసిపోతూ కనిపించే ఈ దృశ్యం నిజంగా ఖగోళ ప్రియులకు పండుగ వాతావరం తీసుకరానుంది.
