Bomb Cyclone : అమెరికాలో ఎడతెరిపి లేని హిమపాతం పడుతోంది. భారీగా పడుతున్న మంచుతో ప్రజలు ఇల్లు దాటి బయటకు రావట్లేదు. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్, పశ్చిమ వర్జీనియా, మిన్నెసోటా ప్రాంతాల్లో మంచు ఎక్కువగా పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆరడుగుల మేర మంచు పేరుకుపోవటంతో రహదారులు మీద వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో రహదారుల మీద వాహనాల రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. మంచులో కూరుకుపోయిన వాహనాలను అత్యవసర బృందాలు బయటకు తీస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న మంచులో చాల ప్రాంతాల్లో ఇల్లు, రోడ్లు, మైదానాలు, చెట్లు ఇలా అన్ని కూరుకుపోతున్నాయి. దట్టంగా పరుచుకున్న మంచు వల్ల బయట ఉన్న వస్తువులన్నీ మాయమయ్యాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోష్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Also: Pele Death: సాకర్ కింగ్ పీలేకు.. ప్రధాని మోదీ సంతాపం
మెక్సికో సరిహద్దులోని టెక్సాస్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి. పలు చోట్ల విద్యుత్ లేక గడ్డ కట్టే చలిలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత రెండు రోజులుగా భారీగా మంచు తుపాన్ కురిసింది. దీంతో ఆరు బయట ఉన్న వస్తువులన్నీ క్రమంగా దట్టంగా పరుచుకున్న మంచు కింద కనిపించకుండా పోయాయి. ఒక చోట ఉన్న ప్లాస్టిక్ కుర్చీ, చిన్న విగ్రహం, ఒక పోల్, కార్లు, అక్కడి రోడ్లు వంటి వాటిపై భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో సుమారు 48 గంటల్లో అవన్నీ మంచు వల్ల మాయమయ్యాయి. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 30 లక్షల మంది ఈ వీడియోను చూశారు. మరోవైపు రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ మేర పెరుగవచ్చని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ అంచనా వేసింది.
48 hour timelapse of Blizzard in 60 seconds. pic.twitter.com/tPjrUFnmzR
— Weird and Terrifying (@weirdterrifying) December 29, 2022
