Site icon NTV Telugu

Delhi Metro: ఢిల్లీ మెట్రోరైల్లో పేలుడు.. వీడియో వైరల్

Delhi Me

Delhi Me

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌లో (Delhi Metro) పేలుడు ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

మెట్రో స్టేషన్ నుంచి రైలు వెళ్తుండగా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్ నుంచి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అయితే ఈ ఘటన ఇది కొద్ది రోజుల క్రితం ఉత్తమ్ నగర్ స్టేషన్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది.

 

కొంతమంది ప్రయాణికులు ఉత్తమ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర మెట్రో రైలు వెళ్తుండగా నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా మెట్రో రైల్లో పెద్ద శబ్దం రావడంతో పాటు ఫ్లాష్ కనిపించింది. ఓవర్ హెడ్ వైర్‌లో సాంకేతిక లోపం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అన్నది ఇంకా తెలియరాలేదు.

 

ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చిన ఈ వీడియోపై ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది.. దీనికి కారణమేంటో అధికారులు వెల్లడిపరచలేదు.

Exit mobile version