FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్లో బీజేపీకి చెందిన మాజీ BJYM జాతీయ కోశాధికారి, రౌడీ షీటర్ పీఎం సాయి ప్రసాద్‌పై ఆరోపణలతో కేసు నమోదైంది. బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొంత పార్టీకి చెందిన మహిళా నేతను, ఆమె కుటుంబాన్ని వేధించడం, బెదిరింపులకు గురిచేయడం వంటి తీవ్రమైన అంశాలు ఈ కేసుకు దారితీశాయి.
ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కఠినమైన సెక్షన్లను పోలీసులు చేర్చారు. మహిళల పట్ల అనుచిత ప్రవర్తనకు పాల్పడినందుకు BNS సెక్షన్ 75, పదేపదే వెంబడించినందుకు సెక్షన్ 78, మహిళ గౌరవానికి భంగం కలిగించినందుకు సెక్షన్ 79 కింద కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రాణహాని లేదా తీవ్రమైన బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 351(3), ఉద్దేశపూర్వకంగా అవమానించినందుకు సెక్షన్ 352 వర్తింపజేశారు.
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ఇలాగే ఇతరుల సమాచారాన్ని, పాస్‌వర్డ్‌లను అనధికారికంగా ఉపయోగించినందుకు ఐటీ చట్టం సెక్షన్ 66C, మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు సెక్షన్ 66E కింద కేసులు నమోదు చేశారు. వీటితో పాటు బాధితురాలి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి బహిరంగంగా అవమానించడం, కులం పేరుతో దూషించడం, మహిళలపై బలప్రయోగం లేదా లైంగిక స్వభావంతో కూడిన దాడులకు పాల్పడిన ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(r), 3(1)(s), మరియు 3(1)(w)(i, ii) కింద కూడా కేసులు పెట్టారు.
సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలే ఈ విధంగా వేధింపులకు గురికావడం, అది కూడా రౌడీ షీటర్‌గా పేరున్న వ్యక్తిపై ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సాయి ప్రసాద్‌తో పాటు ఆయన అనుచరులపై కూడా అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కావడంతో, పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!