Site icon NTV Telugu

Bandi Sanjay : చీమలపాడు ఘటనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Karimnagar

Bandi Sanjay Karimnagar

Bandi Sanjay : ఖమ్మం జిల్లా చీమలపాడు ఘటనపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల నిర్లక్ష్యం వల్లే బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు వారి ఆనందం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా? అంటూ ప్రశ్నించారు.

Read Also: Seediri Appalaraju Open Challenge: హరీష్‌రావుకి ఇదే నా ఛాలెంజ్.. దమ్ముంటే ఏపీకి రా..!

మరో వైపు మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు కారణంగా ఒకరు మృతి చెందిన ఘటనపై ఆయన స్పందించారు. ఈఘటన సహించరాని నేరంగా బండి సంజయ్ పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన చెప్పారు. తక్షణమే బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలో విచ్చలవిడిగా కల్తీకల్లు రాజ్యమేలుతుంటే మంత్రి ఏం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కల్తీకల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

Read Also: Cinema to the people: ప్రజల వద్దకు సినిమా. ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఇంట్లోనే చూసేందుకు ఏపీలో ఏర్పాట్లు

Exit mobile version