Site icon NTV Telugu

BJP: భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. ఇవే ఆధారం అంటున్న బీజేపీ..

Rahul Gandhi

Rahul Gandhi

BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, భారత వ్యతిరేకులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. 2024లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను ప్రస్తావిస్తూ.. యూఎస్ చట్టసభ సభ్యురాలు జానిస్ షాకోవ్స్కీ‌తో ఆయన ఉన్న ఫోటోను ప్రస్తావించింది. ఈ వారం షాకోవ్క్సీ 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్‌కు అనుకూలంగా ఒక లేఖపై సంతకం చేశారు. ఉమర్ ఖలీద్‌ను విడుదల చేయాలని కోరుతూ, మరో ఏడుగురితో కలిసి ఆమె సంతకం చేశారు.

Read Also: 200MP కెమెరా, 6500mAh బ్యాటరీ.. ప్రత్యేక ఆకర్షణగా Oppo Reno 15 Pro Mini!

ఈ సంబంధాలను హైలెట్ చేస్తూ బీజేపీ నేత ప్రదీప్ భండారీ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ యాంటీ-ఇండియా నేతలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో రాహుల్ గాంధీ షాకోవ్స్కీ, ఇల్హాన్ ఒమర్‌తో కలిసి ఉన్నారు. ఇల్హాన్ ఒమర్ తీవ్ర భారత వ్యతిరేకి, పాకిస్తాన్ మద్దతురాలు. పలు సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్‌ గురించి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ.. భారతదేశాన్ని బలహీనపరచాలని చూసేవారు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకునే వారు, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను నీరుగార్చాలనుకునే వారు అతడి(రాహుల్ గాంధీ) చుట్టూ చేరుతారు’’ అని అన్నారు. అయితే, బీజేపీ విమర్శలపై రాహుల్, కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు.

జానిస్ షాకోవ్స్కీ అంతర్జాతీయ ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, భారతదేశాన్ని స్పష్టంగా ప్రస్తావించింది, కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపించిందని ప్రదీప్ భండారీ అన్నారు. ఇటీవల, డిసెంబర్ 30న జానిస్ షకౌస్కీతో పాటు మరో ఏడుగురు అమెరికా శాసనసభ్యులు ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ ఇవ్వాలని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా విచారణ జరపాలని భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉమర్ ఖాలిద్‌పై ఉగ్రవాద ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సందేహాస్పదమని, మానవ హక్కుల సంస్థలు కూడా అతడిని ఉగ్రవాద చర్యలతో అనుసంధానించలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఈ కేసు విచారణలో ఐదేళ్లుగా జైలులో ఉన్నాడు. ఆయన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ పూర్తై తీర్పు రిజర్వ్‌లో ఉంది.

Exit mobile version