NTV Telugu Site icon

Atal Bihari Vajpayee: కోట్లాది ఇళ్లు నిర్మించారు.. కుగ్రామాలకు రోడ్లు వేసిన ఘనత వాజ్‌పేయిది: కిషన్ రెడ్డి

Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నివాళులర్పించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అటల్ బిహారి వాజపేయి విశిష్ట సేవలు దేశానికి అందించారన్నారు. కోట్లాది ఇల్లు నిర్మించారని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కుగ్రామలకు రోడ్లు వేసిన ఘనత ఆయనదని ప్రశంసించారు.

Also Read: CP Avinash Mahanthi: న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందే.. సన్ బర్న్‌కు అనుమతులు ఇవ్వలేదు!

‘కేంద్ర ప్రభుత్వం అటల్ బిహారీ వాజపేయి జయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా పాటిస్తుంది. వాజపేయి విశిష్ట సేవలు దేశానికి అందించారు. మెజారిటీ లేకున్నా అద్భుతమైన పాలనను అందించారు. ఒక ఓటు తక్కువ ఉంటే.. రాజీనామా చేసిన ఆదర్శ వ్యక్తి. కోట్లాది ఇల్లు నిర్మించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కుగ్రామలకు రోడ్లు వేసిన ఘనత ఆయనది. పాకిస్తాన్ తోక జాడిస్తే యుద్ధం చేస గెలిచిన వ్యక్తి వాజపేయి. పొక్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన వ్యక్తి ఆయన. వాజపేయి అడుగు జాడల్లో ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తున్నారు. అవినీతి ఆరోపణలు లేని పారదర్శక పాలన అందిస్తూ.. అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మోడీ. శక్తిశాలి దేశంగా భారత్ అవతరిస్తుంది. వాజపేయి కోరుకున్నట్లు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తి అవుతుంది. అయన ఆత్మ ఎక్కడ ఉన్నా సంతోషిస్తుంది’ అని కిషన్ రెడ్డి అన్నారు.