Site icon NTV Telugu

BJP Satyakumar : రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు బేజారు కేంద్రాలుగా మారాయి

Bjp Satyakumar

Bjp Satyakumar

రాష్ట్రంలో రైతాంగాన్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఆదివారం వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఆర్అండ్‌బీ అతిధి గృహంలో సత్యకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జగన్ వారి తండ్రి తెచ్చిన పథకాలను కూడా రద్దు చేస్తున్నారని, రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు బేజారు కేంద్రాలుగా మారాయని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చింది.. రాష్ట్రానికి కావాల్సింది 2 లక్షల పై చిలుకు యూరియా…. రైతాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా జగన్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది… డ్రిప్ కోసం 55 శాతం సబ్సిడీ కేంద్రం ఇస్తుంటే రాష్ట్రం విస్మరిస్తుంది.. రైతు భరోసా కేంద్రాలకు 175 కోట్లు కేంద్రం కేటాయించింది.. కడప లో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేని దుస్థితి.. గండికోట నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారం ఇవ్వని సీఎం జగన్… జిల్లాలో అన్నమయ్య డ్యామ్ నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది…మూడు రాజధానుల పేరిట రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. సొంత నియోజకవర్గం పులివెందుల లో బస్టాండ్ నిర్మించలేని దౌర్భాగ్యం సీఎం జగన్ ది… కడప లో ఒక మహిళా జూనియర్ కళాశాల లో కేవలం ఆరు మరుగుదొడ్లు ఉన్నాయి… దాదాపు 1200 మంది మైనార్టీలు అక్కడ విద్యానభ్యసిస్తున్నారు.

 

పులివెందుల దళిత మహిళ పై అత్యాచారం జరిగితే కేసు లేదు.. సీఎం జగన్ సొంత నియోజకవర్గం లో హిజ్రాల పై అత్యాచారం… వైసీపీ కి చెందిన వారే హిజ్రాలను అత్యాచారం చేశారు… సీఎం జగన్ ను ప్రశ్నిస్తే కోపం వస్తుంది… రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి సొంత నియోజకవర్గం పెడన లో 7600 ఇల్లు కేంద్రం మంజూరు చేస్తే ఇప్పటిదాకా కట్టింది 1400 ఇల్లు… 99 భారీ పరిశ్రమ లు వచ్చాయని పరిశ్రమల శాఖ మంత్రి చెప్తున్నారు… కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ రాలేదు.. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు గాల్లో నిర్మిస్తున్నారో అర్థం కావట్లేదు… యూనివర్సిటీ లకు పేర్లు మార్చడం వల్ల ఏమి ఒరగదు సీఎం జగన్.. బ్యారికేడ్లు కట్టుకుని సొంత నియోజకవర్గం వెళ్లే దౌర్భాగ్యం సీఎం జగన్ కు పట్టింది… రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ అభివృద్ధి పై శ్రద్ధ పెట్టాలి అని హితవు పలికారు.

 

 

Exit mobile version