Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Wedding: ఉత్తరప్రదేశ్ ల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత, మీరట్ జిల్లా పంచాయత్ చైర్మన్ గౌరవ్ చౌదరి.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాజీ భార్య మోనికా యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. గురువారం హిమాచల్ ప్రదేశ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక గోప్యంగా జరిగింది. ప్రస్తుతం ఫరూఖాబాద్ జిల్లా పంచాయత్ చైర్ పర్సన్‌గా ఉన్న మోనికా యాదవ్.. 2021లో సమాజ్‌వాదీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజకీయంగా ప్రముఖ యాదవ్ కుటుంబానికి చెందిన ఆమె.. ఒకప్పుడు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కుటుంబంతో మంచి అనుబంధం కలిగి ఉన్నారు.
మోనికా యాదవ్, ధర్మేంద్ర యాదవ్ దంపతులు 2016లో విడాకులు తీసుకున్నారు. ధర్మేంద్ర యాదవ్.. అఖిలేశ్ యాదవ్‌కు బంధువు. మరోవైపు గౌరవ్ చౌదరి కూడా తన తొలి భార్యతో చట్టపరంగా విడిపోయిన తర్వాత మోనికాతో వివాహం చేసుకున్నారు. దీంతో ఇది ఇద్దరికీ రెండో వివాహం. అందిన సమాచారం ప్రకారం.. గౌరవ్ చౌదరి, మోనికా యాదవ్ దాదాపు ఏడాది కాలంగా ఒకరికొకరు పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఓ అధికారిక కార్యక్రమంలో తొలిసారి కలిసిన వీరిద్దరూ.. అభివృద్ధి, స్థానిక పాలన అంశాలపై చర్చల సందర్భంగా దగ్గరయ్యారని సమాచారం. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారి, చివరకు వివాహ బంధానికి దారితీసినట్లు తెలుస్తోంది.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
మోనికా యాదవ్ రాజకీయ నేపథ్యం కూడా ప్రత్యేకమే. ఆమె తండ్రి నరేంద్ర సింగ్ యాదవ్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ఆమె తాత రాజేంద్ర సింగ్ యాదవ్ కూడా ప్రముఖ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. ప్రజా సోషలిస్టు పార్టీ స్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఇక గౌరవ్ చౌదరి రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. మీరట్ జిల్లాలోని కుసేడి గ్రామానికి చెందిన ఆయన.. 2006లో అంతర్జాతీయ వ్యాపార విద్య కోసం జర్మనీకి వెళ్లారు. అక్కడ హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, హోల్‌సేల్ ట్రేడ్ రంగాల్లో వ్యాపారాలు నిర్వహించి విజయవంతమయ్యారు. అనంతరం 2021లో భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన.. కొద్ది నెలల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్థానిక రాజకీయాల్లో చురుకుగా మారిన గౌరవ్ చౌదరి.. మీరట్ జిల్లా పంచాయత్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కీలక నేతగా ఎదిగారు. ఇప్పుడు మోనికా యాదవ్‌తో ఆయన వివాహం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?