NTV Telugu Site icon

BJP high command for AP: ఏపీకి బీజేపీ హైకమాండ్.. రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసిన కమలం పార్టీ

Amit

Amit

BJP high command for AP: ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ హైకమాండ్ చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు ఏపీకి రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించనున్నారు. జూన్ 8న అమిత్ షా విశాఖకు వస్తుండగా, 10న తిరుపతికి జేపీ నడ్డా రానున్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. ఏపీకి ఏం చేశాము? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాము? అనేది బహిరంగ సభల ద్వారా వివరించనున్నారు అమిత్ షా, జేపీ నడ్డా.

Read Also: TSRTC : వరంగల్ రీజియన్‌లో 132 ఎలక్ట్రిక్ బస్సులు

అయితే గతంలో కర్నూలులో అమిత్ షా పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన టూర్ వాయిదా పడింది. అమిత్ షా తాజా పర్యటన రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అయి.. పొత్తులపై చర్చించారు. అలాంటి నేపథ్యంలో అమిత్ షా పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు పొత్తులకు సంబంధించి హైకమాండ్ చూసుకుంటుందని, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు.

Read Also: Human Bodies: మెక్సికోలో భయానకం.. 45బ్యాగుల్లో మానవ శరీర భాగాలు

ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు ప్రాముఖ్యత నెలకొంది. రాష్ట్రంపై ఏమైనా వరాల జల్లు కురిపిస్తారా.. లేదంటే పొత్తులకు సంబంధించి అమిత్ షా ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అనే దానిపై.. ఉత్కంఠ బీజేపీ నేతల్లో నెలకొంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల ముందు బీజేపీ అగ్రనేతల పర్యటనపై కేడర్ లో మంచి జోష్ రానుంది.