BJP: తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంకు నేడు తెరపడనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు మొదలుకానున్నాయి. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు(బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్) జోరుగా ప్రచారం చేశాయి.
READ MORE: OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన దీపావళి సినిమాలు.. ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవబోతున్నాయంటే
అయితే.. తాజాగా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. మాగంటి సునీతకు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ లేఖతో పాటు రెండు ఓటర్ ఐడీలకు సంబంధించిన సమాచారం సైతం అటాచ్ చేసింది. రెండు ఓటర్ ఐడీలకు సంబంధించి జిరాక్స్ కాపీలను పంపింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిపై పలు ఆరోపణలు ఉండగా.. తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. దీంతో ఎన్నికల సంఘం ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
READ MORE: Kerala: పద్మనాభస్వామి ఆలయంలో బంగారం మాయం కేసు.. దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు..!
