Site icon NTV Telugu

BJP: ఎల్లుండి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్.. జూబ్లీహిల్స్ అభ్యర్థి లిస్ట్ లో ఎవరున్నారంటే?

Jubleehils Bjp

Jubleehils Bjp

మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బై ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎల్లుండి సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్(డిల్లి లో) జరుగనుంది. తెలంగాణ జూబ్లీహిల్స్ అభ్యర్థి నీకేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ రోజు సమావేశం అయిన బీజేపీ ముఖ్య నేతలు… జూబ్లీ హిల్స్ అభ్యర్థి పై చర్చించినట్లు సమాచారం.

Also Read:Kishkindhapuri: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ముగ్గురు పేర్లను షార్ట్ లిస్టు చేసినట్టు సమాచారం. లిస్ట్ లో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ ల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రేపు డిల్లీకి వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఇష్యూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, అభ్యర్థి పై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు రామ చందర్ రావు… రాష్ట్ర కమిటీ లో మరికొందరిని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అడగనున్నారు. బి ఎల్ సంతోష్ , సునీల్ బన్సల్ లను రామ చందర్ రావు కలవనున్నారు.

Exit mobile version