Site icon NTV Telugu

సీఎం కేసీఆర్ పెద్ద తాలిబన్ : బండి సంజయ్

రైతుల పాలిట తాలిబన్ సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. ఇవాళ హుజురాబాద్‌ లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్‌.. టీఆర్‌ఎస్‌ పై ఫైర్‌ అయ్యారు. టీఆర్‌ఎస్‌ ప్రతి ఓటర్ కు 20 వేల రూపాయలు ఇచ్చిందని… 15 వేల రూపాయలను ఆ పార్టీ కార్యకర్తలే మధ్యలోనే దొబ్బేసారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కాష్ ను నమ్ముకుందని… కాలిబర్, క్యారెక్టర్ ను నమ్ముకుంది బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు.

ఈటెల రాజేందర్ పేరుతో ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని… కానీ వారి గోతిలో వారే పడ్డారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే ఉరి వేసుకున్నట్లేనని పేర్కొన్నారు బండి సంజయ్‌. సిద్దిపేట, ఖమ్మం కలెక్టర్ లపై చర్యలు తీసుకోవాలి… లీగల్ గా పోరాటం చేస్తామని.. హెచ్చరించారు. ధాన్యం కొనక పోతే కొనిపిస్తాం… కొనేది కేంద్రం…. వీళ్లు చేసేది బ్రోకరిజం మాత్రమేనన్నారు. విజ్ఞతతో ఓటు వేసి కేసీఆర్ కి బుద్ధి చెప్పాలని కోరుతున్నానని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో జోక్ కాదు .. హరీష్ రావు జోకర్ అన్నారు.

Exit mobile version