USA Tragedy: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నట్లు సమాచారం. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైనా విద్యార్థులు.. అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమైన కాసేపటిలోనే ఘాటైన పొగ వెలువడడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో కేకలు వేశారు. ప్రాణ భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుల్లో విద్యార్థిని సహజరెడ్డి ఒకరు. సహజరెడ్డి కుటుంబం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం నివాసం ఉంటోంది. న్యూయార్క్‌లో ఆమె ఎంఎస్ చదువుతోంది.
READ MORE: Netflix: నెట్‌ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్.. ఏకంగా రూ. ఆరున్నర లక్షల కోట్ల భారీ డీల్..!
తాజాగా ఈ విషాద ఘటనపై సహజారెడ్డి మామయ్య NTVతో మాట్లాడారు. “2021లో ఎంఎస్ చేయడానికి వెళ్ళింది.. మన టైం ప్రకారం గురువారం రాత్రి జాబ్ నుండి వచ్చి తన గదిలో పడుకుంది.. పక్కనే ఉన్న మరో బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. గాలి తీవ్రతకు పక్క బిల్డింగ్ లో తన గదిలో పడుకున్న సహజ గదికి వ్యాపించాయి.. దట్టమైన పొగ, మంటలు రావడంతో సహజతో పాటు మరో ముగ్గురు బిల్డింగ్‌లో ఉండిపోయారు. ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడగా సహజ, మొరాకో అబ్బాయి 80 శాతం కారిపోయారు.. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ సహజ చనిపోయింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం పూర్తయ్యింది.. అవసరమైన ఫార్మాలిటీస్ చేస్తున్నారు.. మా బంధువులు ప్రస్తుతం అక్కడే ఉన్నారు.. సిబ్బంది వెంటనే స్పందించి, అవసరమైన సహకారం అందిస్తున్నారు.. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయితే మంగళవారం బయల్దేరి గురువారం వరకు సహజ డెడ్‌డాడీ ఇంటికి చేరుకుంటుంది.. లేదంటే మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం.. ఎంఎస్ పూర్తి చేసి మంచి జాబ్ సంపాదిస్తుందనే టైంలో ఇలా జరిగింది.. సహజ పేరెంట్స్ జయకర్‌రెడ్డి, శైలజలు తట్టుకోలేకపోతున్నారు.. తీవ్ర విషాదంలో ఉన్నారు..” అని ఆయన వివరించారు.
