Site icon NTV Telugu

Bipasha Basu: ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించా.. వైరల్ అవుతోన్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు వీడియో!

Bipasha Basu

Bipasha Basu

Bollywood Actress Bipasha Basu Cries Video Goes Viral: ‘బిపాషా బసు’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘టక్కరి దొంగ’లో తన అందాలతో అలరించారు. ఆపై బాలీవుడ్ వెళ్లిన బిపాషా.. వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అందుకున్నారు. జిస్మ్, రాజ్, ధూమ్, రేస్, అలోన్, ఆత్మ, కార్పొరేట్, ది లవర్స్ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో బిపాషా నటించారు. చాలా ఏళ్లుగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో డేటింగ్ చేసిన బిప్స్.. 2016లో బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్‌ గ్రోవర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

బిపాషా బసు, కరణ్ సింగ్‌ గ్రోవర్‌ దంపతులకు గత ఏడాది నవంబర్‌లో కుమార్తె దేవి జన్మించింది. తాజాగా తన కూతురు గురించి ఓ ఆసక్తికర విషయం బిపాషా చెప్పారు. తన కుమార్తె దేవి గుండెలో రెండు రంధ్రాలతో పుట్టిందని వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో నటి నేహా ధూపియాతో మాట్లాడిన బిపాసా.. దేవి పుట్టిన 3 రోజులకు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిసిందని, మూడు నెలల వయస్సులో సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారని బోరున ఏడ్చేశారు. ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించానని బిప్స్ చెప్పుకొచ్చారు.

‘మా ప్రయాణం సాధారణ అమ్మ-నాన్నల కంటే చాలా భిన్నంగా సాగింది. ప్రస్తుతం నా ముఖంలో చిరునవ్వు ఉంది కానీ.. గతంలో ఎన్నో కఠినమైన రోజులు గడిపాను. ఏ తల్లికీ ఇలా జరగాలని నేను కోరుకోను. నాకు పాప పుట్టిన మూడో రోజే.. గుండెలో రెండు రంధ్రాలతో పుట్టిందని తెలిసింది. నేను దీన్ని ఎవరితో షేర్ చేయకూడదనుకున్నాను. కానీ ఈ ప్రయాణంలో నాకు ఎంతో మంది తల్లులు సహాయం చేశారు. వారిని కనుగొనడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ సమాచారాన్ని పంచుకుంటున్నాను’ అని బిపాషా బసు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తెలిపారు.

Also Read: Star Vanitha Program: నేటి నుంచే సరికొత్త ప్రోగ్రామ్‌ ‘స్టార్‌ వనిత’.. బోలెడంత ఫన్, సూపర్ గిఫ్ట్స్!

‘పాపకు ఉన్న వెంట్రిక్యులర్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ అంటే ఏమిటో కూడా కరణ్, నాకు అర్థం కాలేదు. మేము మా కుటుంబంతో దీని గురించి చర్చించలేదు. శస్త్రచికిత్స గురించి కరణ్, నేను సిద్ధం అయ్యాం. మొదటి ఐదు నెలలు మాకు చాలా కష్టంగా గడిచాయి. ఐతే దేవి మొదటి రోజు నుంచే బాగుంది. డాక్టర్స్ ప్రతి నెలా స్కాన్‌ చేయించుకోవాలని చెప్పారు. గుండెలో పెద్ద రంధ్రం కారణంగా మూడు నెలల వయస్సులో శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని చెప్పారు. మూడవ నెలలో నేను ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడా. పాప అన్ని రిపోర్ట్స్ చూశా, సర్జన్లను కలిసి శస్త్రచికిత్సకు సిద్ధం అయ్యా. పాపకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అంటే కరణ్ బయపడ్డాడు. సుమారు ఆరు గంటల పాటు సర్జరీ జరిగింది. ఆపరేషన్‌ సక్సెస్‌ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాం. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగుంది’ అని బిప్స్ చెప్పుకొచ్చారు.

Exit mobile version