Site icon NTV Telugu

Bill Gates AP visit: ఐదున్నర గంటలకు పైగా సాగిన బిల్‌ గేట్స్‌ ఏపీ పర్యటన..

Bill Gates Ap Visit

Bill Gates Ap Visit

Bill Gates AP visit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్.. సుమారు ఐదున్నర గంటలు కేటాయించారు. ఉదయం 8.15కు గన్నవరం వినానాశ్రయానికి చేరుకున్నారు గేట్స్.. అయితే, పొగమంచు కారణంగా విమానం కాసేపు చక్కర్లు కొట్టినా సమయానికి వచ్చేశారు.. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్ యాదవ్‌.. బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలికారు. ఇక, గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఏపీ సచివాలయానికి చేరుకున్నారు బిల్ గేట్స్.. ఏపీ సెక్రెటేరియట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ పవన్ కల్యాణ్‌.. ఆయనకు స్వాగతం పలికారు.. మంత్రులను బిల్ గేట్స్ కు పరిచయం చేశారు సీఎం చంద్రబాబు… ఉన్నతాధికారును కూడా కొంతమందిని పరిచయం చేశారు.. ఏపీలో డేటాబేస్.. సాంకేతికత.. ఏ ఐ..క్వామ్.టమ్ కంప్యూటింగ్ ను సీఎం చంద్రబాబు వివరించారు.. మై ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటూ.. సీఎం చంద్రబాబు ను పలకరించారు బిల్ గేట్స్.

Read Also: Hyderabad ATM Theft: నైస్‌గా స్కెచ్చేశాడు.. స్మార్ట్‌గా రూ.60 లక్షలు దోచేశాడు.. కట్‌చేస్తే..

మంత్రు లతో కొద్దిసేపు సమావేశం అయ్యారు బిల్ గేట్స్. వివిధ అంశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు తన కు చాలా పాత మిత్రుడు అన్నారు.. దేశంలో సాంకేతిక విప్లవం కీలక దశలో ఉందన్నారు. కుప్పంలో అమలు చేస్తున్న ఆరోగ్య రంగానికి సంబంధించిన సంజీవని ప్రాజెక్ట్ బావుందన్నారు బిల్ గేట్స్. ఆరోగ్యం.. వ్యవసాయ రంగాలపై దృష్టి పెట్టాలన్నారు బిల్ గేట్స్.. ఇక, సచివాలయంలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు బిల్ గేట్స్.. ఉండవల్లి కి సీఎం చంద్రబాబు. బిల్ గేట్స్.. ఒకే వాహనంలో వెళ్లారు.

ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.. తర్వాత విజయవాడలో స్పోర్ట్స్ మీట్ లో బిల్ గేట్స్ పాల్గొన్నారు.. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో. విజయవాడ నుంచి ముంబై మీదుగా ఢిల్లీ బయలు దేరి వెళ్లారు బిల్ గేట్స్… ఇలా మొత్తంగా సుమారు ఐదున్నర గంటలకు పైగా బిల్ గేట్స్ ఏపీ పర్యటన సాగింది…

 

 

Exit mobile version