Site icon NTV Telugu

Bike Robbery : జల్సాలకు అలవాటుపడి చోరీలు చేస్తున్న యువకులు

Thieves

Thieves

రాత్రులు తిరగటం సిగరెట్లు కాలుస్తూ ఊరంతా బలాదూర్‌గా తిరగటం చేస్తున్న యువత. యువతను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత సమాజం పని. ఇలాంటి కోవలో హైదరాబాద్ పాతబస్తీ కి చెందిన అయిదుగురు యువకులు అందులో ఇద్దరు మైనర్లు కలిసి ద్విచక్ర వాహనాలను దొంగలించటం వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయటం వీరి పని. చాంద్రాయగుట్ట పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో అనుమానస్పదంగా ఉన్న మైనర్ బాలుడిన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. మొత్తం చైన్ బయట పడ్డది.

అందులో ముగ్గురు A1.మొహమ్మద్ అజిజ్ (19), A2. మేహరాజ్ షరీఫ్ అలియాస్ అద్నాన్ (20) , A3 .మొహమ్మద్ జాని పాషా( 21) తో పాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చాంద్రాయగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి పర్యవేక్షణలో, అడిషనల్ డీసీపీ మనోహర్ నేతృత్వంలో ఏసీపీ సూచనల మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్, ఇన్స్పెక్టర్ గురునాథ్ టీమ్ జుల్ఫెకర్, హుస్సేన్, ప్రవీణ్ ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందిని సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి అభినందించారు.

Exit mobile version