NTV Telugu Site icon

Viral Video : వార్నీ.. ఏం తెలివి బాసూ.. ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి..

Bike

Bike

టాలెంట్ ఉన్నోడికే పేరు వస్తుంది.. అది ఎవడబ్బ సొత్తు కాదు అని ఓ సినిమాలో ప్రూవ్ చేశారు.. ఇప్పుడు అలానే కొందరు జనాలు కూడా తమలోని క్రియేటివిటి ఆలోచనలను బయటకు తీసుకొస్తున్నారు.. సాధ్యం కావు అనుకున్న వాటిని కొందరు సాధించి చూపిస్తున్నారు.. అవసరానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో సరికొత్త వస్తువులను తయారు చేస్తుంటారు.. సోషల్ మీడియా ద్వారా అలాంటి ఎన్నో క్రియేటివ్ ఐడియాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఆ వైరల్ అవుతున్న ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఒక వ్యక్తి పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో ఓ బైక్‌ను తయారు చేశాడు.. ఆ బైకు నీటిలో కూడా వేగంగా దూసుకుపోతుంది.. ఓ ఇంస్టాగ్రామ్ యుజర్ దాన్ని షేర్ చేశాడు.. ఓ వ్యక్తి నాలుగు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములను రెండు వైపులా బైక్‌కు కట్టాడు. అనంతరం బైక్‌ను ఓ నదిలోకి పోనిచ్చాడు. ఆ ప్లాస్టిక్ డ్రమ్ముల వల్ల ఆ బైక్ నీటిలో మునిగిపోకుండా ముందుకు వెళ్లింది. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత ఆ యువకుడు బైక్‌ను ఆపి హాయిగా పడుక్కున్నాడు. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు అతని ఐడియా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. వీడియోను పోస్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే మిలియన్స్ వ్యూస్ ను అందుకుంది..ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ ప్రయత్నం చాలా సృజనాత్మకంగా ఉంది. కానీ, ఇది ప్రమాదకరం కావొచ్చు, అద్భుతమైన ఐడియా అంటూ రకరకాల కామెంట్స్ ను అందుకుంది.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వెయ్యండి..

Show comments